IRCTC Tour Package: కేవలం 16 వేలకే ఎన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చో !!

IRCTC North India Tour Package: పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో విహరించి రావాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలి ?, ఎవరు గైడ్ చేస్తారు ? ఎక్కడెక్కడికి వెళ్తే బాగుంటుంది ? ఎంత ఖర్చు అవుతుంది ? అనే వివరాలు తెలియకే చాలామంది తమ ఆలోచనను విరమించుకుంటుంటారు. లేదా తమ ఆలోచనను వాయిదా వేస్తుంటారు.

Written by - Pavan | Last Updated : Jun 6, 2023, 04:39 AM IST
IRCTC Tour Package: కేవలం 16 వేలకే ఎన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చో !!

IRCTC North India Tour Package: ఇప్పుడు మేం చెప్పబోయే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం కేవలం 16,600 రూపాయలకే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి మొదలుపెడితే.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వరకు.. ఎన్నో పుణ్యక్షేత్రాలను కవర్ చేసే ఆధ్మాత్మిక విహారం ఇది. 

భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు టూర్ ప్యాకేజీ పేరు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ జూన్ 22 నుండి ప్రారంభం అవుతుంది. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ఆగ్రా, మధురలోని బృందావన్, హరిద్వార్, రిషికేశ్, పంజాబ్‌లోని అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్ సందర్శించే అవకాశం ఉంటుంది. 

ఇది ఎలాంటి టూర్ ప్యాకేజీ అంటే.., జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని మా వైష్ణో దేవి ఆలయంతో పాటు, గంగమ్మ తల్లి నుంచి మొదలుకుని హరిద్వార్ వరకు పేరొందిన పుణ్యక్షేత్రాలు తిరిగి దైవదర్శనం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. పనిలో పనిగా మీరు రిషికేశ్ హిల్ స్టేషన్ ప్రకృతి అందాలను కూడా దగ్గరగా వీక్షించే అవకాశం పొందవచ్చు..

ఐఆర్సీటీసీ డిజైన్ చేసిన ఈ టూర్ ప్యాకేజీ రూ. 16,600 నుండి ప్రారంభం అవుతుంది. మహారాష్ట్రలోని పూణే నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రిప్పులో ప్రయాణీకుల బస, ఆహారం కోసం రైల్వే శాఖనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజ్ ఎంచుకునే వారు ప్రయాణీకులు మహారాష్ట్రలోని పూణె, లోనావాలా, కర్జాత్, కళ్యాణ్, గుజరాత్ లోని వసాయ్ రోడ్, సూరత్, వడోదర స్టేషన్ల నుండి ఎక్కడైనా ఎక్కవచ్చు లేదా దిగిపోవచ్చు.

ఇది కూడా చదవండి : Using Earphones ? : ఈయర్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారా ? ఐతే ఈ డేంజర్ గురించి తెలుసా ?

ఇక్కడ చెప్పుకోదగిన మరో విశేషం ఏంటంటే, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూనే పర్యాటకులకు చౌకగా ప్రయాణించే విధంగా ఐఆర్సీటీసీ వివిధ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. 9 రాత్రులు, 10 పగళ్లు కలిపి మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. రైలు మార్గం లేని చోట, రైలు దిగిన తరువాత స్థానిక ప్రదేశాల్లో పర్యటించేందుకు టాక్సీలను కూడా వారే ఏర్పాటు చేస్తారు. ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి ఈ టూర్ ప్యాకేజ్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Live Accident Video: అచ్చం ఫాస్ట్ & ఫ్యూరియస్ లో లాగానే.. చూస్తుండగానే రయ్యుమని గాల్లోకి ఎగిరిన కారు.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News