Snake Vs Stray Dogs: సరీస్పపాల్లో పాములు విషపూరితమైనవి. అటవీ ప్రాంతాలతోపాటు సాధారణ ప్రాంతాల్లో కూడా జీవించేవి పాములు. కానీ జనావాసాల్లో పాములు జీవించడం కష్టంగా మారింది. మనుషులే కాదు ఇతర జంతువులు కూడా పాములను బలి తీసుకుంటాయి. మనం ఇన్నాళ్లు పాము ముంగిస కొట్లాట.. సయ్యాట చూశాం. కానీ కుక్కలతో పాము పోట్లాట చూడడం చాలా అరుదు. తాజా ఓ వీడియో బయటకు వచ్చింది. ఒకేసారి ఐదు కుక్కలు చుట్టుముట్టగా పాము వాటితో పోరాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఎక్కడో ఒక చోట ప్రాంతం పేరు తెలియదు. కానీ వీధి కుక్కలన్నీ చుట్టుముట్టాయి. కానీ పాము మాత్రం భయపడలేదు. కుక్కలు దాడి చేస్తుండగా పాము ధైర్యంగా ఎదుర్కొంది. ఒకటి తోక పట్టుకోగా.. మరోటి మధ్యలో.. ఇంకొన్ని పాము తల వైపు దాడి చేయడం ప్రారంభించాయి. మూకుమ్మడిగా దాడి చేస్తున్న కుక్కలను పాము పడగ విప్పి విరుచుకుపడింది. కుక్కలపై బుసలు కొడుతూ.. విషం చిమ్ముతూ తనను తాను రక్షించుకునేందుకు తీవ్రంగా పోరాడింది. కుక్కలకు ఏమాత్రం లొంగకుండా సింహం సింగిల్‌గా అన్నట్టు పాము ఒంటరిగా తీవ్ర పోరాటం చేసింది.
ఈ వీడియోను చూస్తున్నవారంతా తమ జీవితానికి అన్వయించుకుంటున్నారు. ఈ వీడియోతో ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. అందరం కలిసికట్టుగా పని చేస్తే పామును ఓడించవచ్చని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరొకరు పాముకు మద్దతు తెలిపారు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా.. శత్రువులు ఎంతమంది దాడి చేసినా ఒంటరిగా.. ధైర్యంగా పోరాడితే అంతిమంగా విజయమే సాధ్యమనే విషయాన్ని ఈ సంఘటన చాటి చెబుతోందని వివరించాడు. పాము, కుక్కల పొట్లాటను జీవితాన్ని అన్వయించుకోవచ్చని సూచిస్తున్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే ఎక్కడైనా విజయమని.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించవచ్చని పేర్కొంటున్నారు. ఈ వైరల్ వీడియోను కూడా ఇంత సానుకూల దృక్పథంతో నెటిజన్లు చూస్తుండడం హర్షించే విషయం.
Also Read: King Cobra on Fan: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఫ్యాన్‌పై తిరుగుతూ కింగ్ కోబ్రా హల్‌చల్
Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్ చేసి పిలుపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook