Indian YouTubers Pay Tax: ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్‌కు Google షాకింగ్ న్యూస్

Indian YouTubers Pay Tax On Earnings To Google:యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించే భారత యూట్యూబ్ క్రియేటర్లు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2021 నుంచి అదనపు పన్నులు అమలులోకి రానున్నాయని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 11, 2021, 08:31 PM IST
  • భారత్‌ సహా ఇతర దేశాల్లో యూట్యూబ్‌ వీడియోలు క్రియేట్ చేస్తున్న వారికి బ్యాడ్ న్యూస్
  • భారత యూట్యూబ్ క్రియేటర్లు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది
  • జూన్ 2021 నుంచి అదనపు పన్నులు అమలులోకి రానున్నాయని గూగుల్ ప్రకటన
Indian YouTubers Pay Tax: ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్‌కు Google షాకింగ్ న్యూస్

Indian YouTubers May Pay Tax On Earnings: అమెరికా మినహా భారత్‌ సహా ఇతర దేశాల్లో యూట్యూబ్‌ వీడియోలు క్రియేట్ చేస్తున్న వారికి యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ చేదు వార్త చెప్పింది. యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించే భారత యూట్యూబ్ క్రియేటర్లు అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2021 నుంచి అదనపు పన్నులు అమలులోకి రానున్నాయని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికాకు చెందిన యూట్యూబర్‌లకు చెల్లింపులపై మాత్రం గూగుల్ ఊరట కల్పించింది. వారికి మాత్రం పన్నులు తగ్గించాల్సి ఉంటుందని గూగుల్ అభిప్రాయపడింది. అమెరికా మినహా ఇతర దేశాలలో యూట్యూబ్(YouTube) వీడియోలు క్రియేట్ చేసి దాని ద్వారా ఆర్జించే వారికి ఈ జూన్ నుంచి అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. గూగుల్ తాజా నిర్ణయంపై అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తుండగా, భారత యూట్యూబ్ క్రియేటర్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Also Read: Twitter new feature: త్వరలో కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టనున్న ట్విట్టర్, ఆ ఫీచర్లు ఇవే

‘రాబోయే కొద్ది వారాల్లో మీరు తగ్గించిన పన్ను మొత్తాన్ని నిర్ణయించడానికి సమాచారాన్ని యాడ్ సెన్స్‌లో సమర్పించాలని యూట్యూబ్ సూచించింది. మీరు మే 31, 2021 లోపు సమాచారాన్ని సమర్పించకపోతే, మీ మొత్తం ఆదాయంలో అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత యూబ్యూబ్ ఖాతాదారులు W-8Ben ఫామ్ నింపాలి. వ్యాపార సంస్థలు W-8Ben-E ఫామ్ నింపాల్సి ఉంటుందని’ యూట్యూబ్, Google అధికారిక ప్రకటనలో తెలిపింది.

Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్

పన్ను వివరాలు మీరు సబ్మిట్ చేసినట్లయితే 0 నుంచి 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెరికా యూజర్ల నుంచి 200 డాలర్లు మీరు సంపాదించినట్లయితే అందులో 60 డాలర్లు పన్నుగా కట్ అవుతుంది. మరోవైపు యూట్యూబ్ క్రియేటర్స్ మే 31 వరకు సాధ్యమైనంత త్వరగా సమర్పించాలి. దీనిపై త్వరలో మరిన్ని మార్గదర్శకాలు గూగుల్ లేదా యూట్యూబ్ విడుదల చేయనున్నాయి.

Also Read: WhatsApp: వినియోగదారులకు వాట్సాప్ సరికొత్తగా Mute Video ఫీచర్, మీరు ట్రై చేస్తారా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News