Honest Thief: నేను దొంగనే.. కానీ మంచి దొంగను.. వైరల్ వీడియో

Chori Karke Acha Laga Lekin: చోరీ చేసిన పట్టుబడిన యువకుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న వీడియో ఇది. దొంగతనం చేసినప్పుడు నీకు ఏమనిపించింది అని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసు అడిగాడు. అందుకు చోర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2022, 08:19 PM IST
Honest Thief: నేను దొంగనే.. కానీ మంచి దొంగను.. వైరల్ వీడియో

Chori Karke Acha Laga Lekin: చోరీలు చేయడం.. వచ్చినదాంతో నలుగురు పేదోళ్లకు పంచిపెట్టడం.. అనాధలను చేరదీసి వారిని పోషించడం, వీధి కుక్కలు, పశువులు లాంటి మూగ జీవాలను సాదడం.. ఇటువంటి సీన్స్ కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం కదా.. కానీ రియల్ లైఫ్ లో నేను కూడా అదే పని చేశానంటున్నాడు ఈ వీడియోలో కనిపిస్తున్న దొంగ. ఓ చోట చోరీ చేసి ఆ తరువాత పోలీసులకు దొరికిపోయిన ఈ దొంగను పోలీసులు ఫన్నీ స్టైల్లో విచారించారు. అప్పుడు దొంగ చెప్పిన సమాధానాలు విని పగలబడి నవ్వడం పోలీసుల వంతయ్యింది.

చోరీ చేసిన పట్టుబడిన యువకుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న వీడియో ఇది. దొంగతనం చేసినప్పుడు నీకు ఏమనిపించింది అని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసు అడిగాడు. అందుకు చోర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?.. చోరీ చేసినప్పుడు మంచిగానే అనిపించింది అని దొంగ చెప్పడంతోనే పోలీసులంతా పగలబడి నవ్వారు. పోలీసులే కాదు.. అతడు చెప్పిన విధానం చూస్తే ఆ వీడియో చూసిన వారికి కూడా నవ్వు రాకమానదు. 

దొంగతనం చేసినప్పుడు మంచిగానే అనిపించింది కానీ ఆ తరువాతే తప్పుగా అనిపించింది అని ఆ యువ చోర్ చెప్పుకొచ్చాడు. ఎందుకు తప్పుగా అనిపించిందంటే.. అప్పటికి తనకు పశ్చాత్తాపం కలిగినట్టు చెప్పాడు. అప్పుడు పోలీసు ఆఫీసర్ మరో ప్రశ్న అడిగాడు. చోరీ చేస్తే నీకు ఎంత లభించింది అని పోలీసు అధికారి అడగ్గా.. 10 వేలు వచ్చాయన్నాడు. ఆ పది వేల రూపాయలతో ఏం చేశావని అడిగాడు పోలీసు అధికారి. 

ఆ పది వేలతో వీది కుక్కలకు, గేదెలకు ఆహారం పెట్టానన్నాడు. రోడ్డు మీద ఉండే నిరాశ్రయులకు, నిరుపేదలకు బ్లాంకెట్స్ పంచిపెట్టానన్నాడు. ఆ దొంగ చెప్పిన మాటలు దొంగ మాటలేనా లేక నిజం చెప్పాడా అనేది ఎవ్వరికీ తెలియదు కానీ అతడు చెప్పిన సమాధానం విని కొంతమంది నెటిజెన్స్ అతడిని రాబిన్ హుడ్ అని, క్రాంతికారి చోర్ అని అభినందిస్తుంటే.. ఇంకొంతమంది దొంగ చెప్పేవి దొంగ మాటలే ఉంటాయి కానీ నిజం ఎలా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. 

చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో దొంగను సరదాగా ఇంటరాగేట్ చేస్తూ మనకు కనిపించింది ఆ జిల్లా ఎస్పీ డా అభిషేక్ పల్లవ. ఆ చుట్టూ కూర్చుని ఇంటరాగేషన్ చూస్తూ దొంగ చెప్పే ఆన్సర్స్ విని ఎంజాయ్ చేస్తున్న వాళ్లంతా ఎస్పీ అభిషేక్ పల్లవ టీమ్.

Trending News