Dog perform pradakshina for navagraha in rajannasiricilla: మన దేశంలో ఉన్న వాళ్లంతా భిన్న మతాలను, ఆచారాలను పాటిస్తుంటారు. తమకు ఇష్టమైన దైవారాధన చేస్తుంటారు. కొందరు హిందు దేవుళ్లను కొలిచి ఆలయాలకు వెళ్తుంటే, మరికొందరు మజ్జీద్ లకు వెళ్లి నమాజ్ లు చేస్తుంటారు. కిస్టియన్ లు ఏసు ప్రభువును ఆరాధిస్తుంటారు. అయితే.. కొన్నిసార్లు దేవుళ్ల నమ్మకాలను సంబంధించి అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. దేవుడి విగ్రహాలు పాలు తాగడం, విగ్రహంలో కదలికలు కన్పించడం, పూజ చేస్తుండగా పూలు కింద పడటం వంటివి జరుగుతుంటాయి. వీటిని భక్తులు ఏదో ఒక మంచి సందేశంగా భావిస్తారు.
ఈ నేపథ్యంలో నిన్న దేశ వ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రమైన రోజుగా భావించారు. ఈరోజున శనిజయంతితో పాటు, పంచగ్రహ కూటమి కూడా ఏర్పడటం ఎంతో అరుదైన విషయంగా పండితులు సూచించారు. దీంతో నిన్న (శుక్రవారం జూన్ 6) న ఉదయం నుంచి ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. భక్తులంతా శనీదేవుడికి ప్రత్యేకంగా అభిషేకం, పూజలు నిర్వహించారు.
అంతేకాకుండా... శనీకి తైలాభిషేకం నిర్వహించారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతితో బాధపడుతున్న వారందరికి కూడా ఇది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఈరోజున శనిపూజలు చేస్తే.. గ్రహబాధలు తొలగిపోయిన మంచి జగుతుందని భావిస్తారు. ఈ క్రమంలో.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్లలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లలో అరుదైన ఘటన జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. శని జయంతి రోజున భక్తులు పెద్ద ఎత్తున భక్తులు ఆలయంకు చేరుకుంటుంటారు. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మాములే.. ఇది మనం రెగ్యులర్ గా చూస్తు ఉంటాం.
కానీ ఇక్కడ మాత్రం.. ఒక శునకం ఇలా నవ గ్రహాల చుట్టూ తిరగడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. శునకం పిల్ల నవగ్రహల చుట్టు తిరుగుతూ ఉంది. దాదాపుగా పదకొండు సార్లు నవగ్రహాల చుట్టు ప్రదక్షిణలు చేసిందని అక్కడున్న వారు చెప్తున్నారు. నల్ల శునకంను శనీ బాధలున్న వారు ఆహరం పెట్టాలని చెప్తుంటారు. చపాతీలు, పాలు పెడితే గ్రహదోషాలు ఉండవని చెప్తుంటారు. ఈ క్రమంలో శనిజయంతి, పంచగ్రహ కూటమి రోజున ఈ ఘటన చోటుచేసుకొవడంతో ఈ ఘటన కాస్త వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter