Dog Viral Video: తల వంచి మరీ బొజ్జ గణపతిని మొక్కిన శునకం.. వీడియో చూసి వావ్ అనకుండా ఉండలేరు!

Viral Video, Dog Bows Down To Pray Lord Ganesha. బొజ్జ గణపతిని మనుసులు మొక్కడం సాధారణమే అయినా.. ఓ శునకం మొక్కడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 15, 2022, 06:58 PM IST
  • తల వంచి మరీ బొజ్జ గణపతిని మొక్కిన శునకం
  • వీడియో చూసి వావ్ అనకుండా ఉండలేరు
  • 1.5 మిలియన్లకు పైగా వ్యూస్
Dog Viral Video: తల వంచి మరీ బొజ్జ గణపతిని మొక్కిన శునకం.. వీడియో చూసి వావ్ అనకుండా ఉండలేరు!

Dog prays Lord Ganesha like a man: అడ్డంకులను తొలగించేవాడుగా ప్రసిద్ది చెందిన గణపతిని హిందువులు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని వేలాది మంది ప్రజలు గణపతిని ఆరాధిస్తారు. ఇంట్లో లేదా దేవాలయాలకు వెళ్లి తీర్ధ ప్రసాదాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇక నవ రాత్రుల్లో అయితే ప్రతి గల్లీలో గణేషుడి విగ్రహాలు పెట్టి మరీ పూజిస్తారు. గణపతిని మనుసులు మొక్కడం సాధారణమే అయినా.. ఓ శునకం మొక్కడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. 

ఓ శునకం మనుషుల మాదిరిగానే రోజూ గణపతిని మొక్కుతుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర పూణేలోని దగ్దుషేత్ గణపతి మందిరంకు ఓ కుక్క తన యజమానితో సహా వస్తుంది. యజమాని గణేష్ విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి బొజ్జ గణపతిని మొక్కుతుండగా.. కుక్క ముందర కాళ్లను వంచి తల నేలకు తాకించి మొక్కింది. గణేశుడిని ప్రార్ధించిన అనంతరం కుక్క లేచి యజమానితో పాటు వెళ్ళిపోతుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pure thrift (@thrifts_grace)

శునకం తన తల వంచి మరీ బొజ్జ గణపతిని మొక్కిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'thrifts_grace' అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 261k లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆచ్చర్యపోతున్నారు. సూపర్ డాగ్, వాట్ ఏ లవ్లీ కుక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. 

Also Read: Kriti Sanon Pics: గ్రీన్ డ్రెస్‌లో కృతి సనన్.. హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న ఆదిపురుష్‌ భామ!  

Also Read: దేశం కోసం ఐపీఎల్ 2023 నుంచి త‌ప్పుకున్న ఆసీస్ పేసర్.. గాయపడిన బుమ్రా ఐపీఎల్ ఆడతాడు అంటూ భారత ఫాన్స్ సెటైర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News