Live Accident Video Caught on Bodycam: ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్స్ వినియోగం భారీగా పెరిగిపోయింది. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ప్రపంచం నలుమూలలా రోజూ కొన్ని వేలాది మంది జనం రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి.. కానీ అన్నింటిలోనూ అతి ఎక్కువగా కనిపించే ఏకైక కారణం ఏదైనా ఉందా అంటే అది ఓవర్ స్పీడ్ అనే చెప్పుకోవాలి.
ఎన్నో యాక్సిడెంట్స్ వెనుక ఉన్న కామన్ రీజన్ ఓవర్ స్పీడ్ అని రోడ్డు ప్రమాదాలపై జరిగిన ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటూ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకి ఇరువైపులా హెచ్చరికల బోర్డులు పెట్టినప్పటికీ.. కొంతమంది కుర్రకారు మాత్రం తమ కారు వేగానికి కళ్లెం వేయరు. ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాల్లో చాలా మంది రేసులో పాల్గొంటున్న తరహాలోనే అతి వేగంగా కారును డ్రైవ్ చేస్తుంటారు. కానీ సరిగ్గా అలా కారును ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేస్తున్నప్పుడే అనుకోకుండా ఏదైనా ఊహించని పరిణామం ఎదురైతే.. అప్పుడు అతి వేగంతో వెళ్తున్న వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అలా వాహనాన్ని అదుపుచేయలేని పరిస్థితుల్లోనే వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటుంటాయి. ఒకవేళ కారు అతి వేగంగా లేనట్టయితే.. అనుకోకుండా ఏదైనా ప్రమాదం ఎదురైనా.. వారికి తమ వాహనాన్ని అదుపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
తాజాగా ట్విటర్‌లో ఒక కారు యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. ఒక రోడ్డు ప్రమాదం ఘటనను దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసులు.. టోయింగ్ వెహికిల్‌ని రోడ్డుపైనే ఒక పక్కకు నిలిపి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతలోనే అదే రోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. అక్కడ పార్క్ చేసి ఉన్న టోయింగ్ వెహికిల్ ర్యాంప్‌పైకి ఎక్కి అమాంతం గాల్లోకి లేచింది. అచ్చం హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలోని యాక్షన్ సీన్ తరహాలో కారు గాల్లోకి లేచిన దృశ్యం అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి బాడీక్యామ్ లో రికార్డయింది. అలా అమాంతం గాల్లోకి లేచిన కారు ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి నేలను ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
A driver survived with serious injuries after hitting a tow truck ramp off a highway in Georgia. Police were on scene for another crash when bodycam video captured the moment. pic.twitter.com/VYZ9VfiSJk
— CNN (@CNN) May 31, 2023
ఇది విదేశాల్లో చేసుకున్న ఘటన. అయితే, ఇండియాలో కూడా ఇదే తరహాలో రోడ్డుపై ఒక పక్కకు పార్క్ చేసి ఉన్న వాహనాలను వేగంగా వెనుక నుంచి వచ్చిన వేరే వాహనాలు ఢీకొన్న ఘటనలు అనేకం ఉన్నాయి. రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచడం అనేది వారికే కాకుండా వెనుక నుంచి వచ్చే వాహనాలకు కూడా అత్యంత ప్రమాదకరంగా మారుతుంది అని ఈ ఘటన నిరూపించింది. ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా జనం అలాంటి పనులు చేయకుండా గుణపాఠం నేర్చుకోవాలి. లేదంటే జీవితంలో రియల్ యాక్సిడెంట్స్ నేర్పించే గుణపాఠాలు మాములుగా ఉండవు మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook