Snake Video Viral: రోజు మాదిరి కబోర్డు తెరచి దుస్తులు తీసుకుంటుండగా అనుహ్యంగా బుస్.. బుస్సంటూ పాము కనిపించింది. ఏమరుపాటున ఉంటే మాత్రం పాము కాటేసేది. కానీ చూసి తెరవడంతో ఓ మహిళ అత్యంత విషసర్పం బారి నుంచి బయటపడింది. చాకచక్యంగా వ్యవహరించడంతో తల్లి తన పిల్లలను అత్యంత విషపూరిత పాము నుంచి కూడా రక్షించుకుంది. ప్రమాదకర ఆ పాము కరిస్తే వారి ప్రాణాలే పోయేవి. ఈ షాకింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇంటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే క్రిమీ కీటకాలు వాలిపోతాయి. నిత్యం శుభ్రం చేసుకుంటూ ఉంటే విషసర్పాలు కూడా కనిపించవు. ముఖ్యంగా మూలల్లో శుభ్రత పాటించాలి. ఇంట్లో కబోర్డులు తీస్తున్నారా.. ఆ తీసే సమయంలో కొంత చూసి తీయండి. ఏమైనా విషసర్పాలు ఉండే ప్రమాదం పొంచి ఉంది. ఇలాగే ఆస్ట్రేలియాలోని ఓ కుటుంబానికి ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో రోజు మాదిరి కబోర్డు తెరవగా ఊహించని అతిథి కనిపించింది.
అది బుసలు కొడుతూ ముద్దుగా కబోర్డు మూలన కూర్చుంది. కబోర్డు తెరచిన ఆ తల్లి టై, లేదా బెల్టుగా భావించి తీసే ప్రయత్నం చేయగా అక్కడ పాము కనిపించడంతో భయాందోళన చెందింది. వెంటనే ఇంట్లో పిల్లలను పిలిచి పాము విషయాన్ని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అనంతరం మెల్లగా కబోర్డులన్నీ తెరిచింది. చడీచప్పుడు కాకుండా వార్డ్ రోబ్‌ను తెరవడంతో చుట్టూ అల్లుకుని పాము కూర్చుంది.
భయాందోళన చెందిన ఆమె వెంటనే పాములు పట్టే వ్యక్తి మార్క్ పాలేను పిలిపించింది. అనంతరం అత్యంత జాగ్రత్తగా.. సురక్షితంగా ఆ పామును బయటకు పంపించారు. అయితే పట్టుబడిన ఆ పాము ప్రపంచంలోనే అత్యంత విషం కలిగిన రెండోది అని తెలిసింది.
ఆ పాములో అత్యంత విషం ఉంటుందని.. ఆ పాము కరిస్తే మనిషి శరీరంలోకి వెంటనే వ్యాపించి ప్రాణం పోయే పరిస్థితి అని మార్క్ పాలే తెలిపాడు. పాము వీడియోను పాలే తన ఫేసుబుక్‌లో పోస్టు చేశాడు. ఈ పాము 5 అడుగుల పొడవు ఉందని వివరించాడు. ప్రపంచంలోనే రెండో అత్యంత విషం కలిగిన పాముగా చెప్పాడు. మార్క్ పాలే స్నేక్ సొసైటీ కార్యకర్తగా పని చేస్తుంటాడు. పాములు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతుంటాడు. ప్రజలను పాముల నుంచి రక్షిస్తున్నాడు. పట్టుకున్న పాములను సురక్షితంగా అడవుల్లో వదులుతున్నాడు. ఈ సంఘటన చూసి మీరు కూడా కబోర్డులు, సెల్ఫ్‌లు, వార్డ్ రోబ్‌లు ఒకసారి చూసి తెరవండి అని అతడు సూచిస్తున్నాడు.
Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ
Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter