IPL 2023 Today Match Delhi Capitals Vs Mumbai Indians Dream 11 Tips: ఐపీఎల్ 2023లో తొలి విజయం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తహతహలాడుతున్నాయి. ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలవ్వగా.. ముంబై రెండు మ్యాచ్‌ల్లో రెండు ఓటములతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రెండు జట్లు వరుస ఓటములకు బ్రేక్ వేసి.. తొలి గెలుపే లక్ష్యంగా నేడు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. రెండు జట్లలోని ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పిచ్ రిపోర్ట్ ఇలా..
అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. గత నాలుగేళ్లుగా ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధికసార్లు ఛేజింగ్ జట్టునే విజయం వరించింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. ఛేజింగ్ చేసిన జట్టు 23 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొత్తం 32 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ముంబై 17 మ్యాచ్‌ల్లో విక్టరీ సాధించింది. మరోసారి రెండు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.
ఢిల్లీ జట్టు విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్ మినహా ఎవరూ రాణించడం లేదు. వార్నర్ కూడా నెమ్మదిగా ఆడుతుండడం విమర్శలకు తావిస్తోంది. పృథ్వీ షా, మనీశ్ పాండే, రిలీ రోసౌ, రోవ్‌మన్ పావెల్ వంటి బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ అవుతుండడం జట్టును దెబ్బ తీస్తోంది. అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో ఢిల్లీ జట్టుకు పెద్దగా సమస్యలు లేవు.
ఇక ముంబై జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మూడు మంచి షాట్లు ఆడటం.. తరువాత నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకోవడం పరిపాటిగా మారింది. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చాడు. తిలక్ వర్మ మినహా.. కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ పుంజుకుంటే ముంబై ఇండియన్స్‌కు బెంగతీరినట్లే. బౌలింగ్‌లో జోఫ్రా అర్చర్ గాయం కారణంగా దూరమవ్వంగా ఇబ్బందిగా మారింది. జాసన్ బెహండ్రాఫ్పైనే ముంబై ఆశలన్నీ ఉన్నాయి. సందీప్ వారియర్, పీయూష్ చావ్లా, హృతిక్ షోకీన్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మనీష్ పాండే, రిలే రోసు, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, నోకియా.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, పీయూష్ చావ్లా, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహండ్రాఫ్, సందీప్ వారియర్.
డ్రీమ్ 11 టీమ్ (DC Vs MI Dream11 Team): డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), తిలక్ వర్మ, రోవ్‌మన్ పావెల్, టిమ్ డేవిడ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నోకియా, కుమార్ కార్తికేయ, జాసన్ బెహండ్రాఫ్
Also Read: IPL 2023 Records: ఐపీఎల్ 2023లో సూపర్ స్టార్లుగా మారిన ప్లేయర్లు వీళ్లే.. ఈ సీజన్ ఆణిముత్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook