Ugadi Pachadi 2023: ఉగాది పచ్చడిలో అద్భుత ఆయుర్వేద గుణాలు.. విశిష్టత & తయారీ విధానం

Ugadi Pachadi Making Process: ఉగాది పచ్చడి తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 02:36 PM IST
Ugadi Pachadi 2023: ఉగాది పచ్చడిలో అద్భుత ఆయుర్వేద గుణాలు.. విశిష్టత & తయారీ విధానం

Ugadi Pachadi Preparation & Uniqueness: హిందువులకు ఉగాది పండుగ  ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో మొదటి పండగగా భావిస్తారు. అందుకే హిందువులంతా  గుమ్మానికి పూలు కట్టి సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ పూజాలో భాగంగా అందరూ దేవుడికి భక్తితో ఉగాది పచ్చడిని సమర్పిస్తారు. ఈ  పచ్చడిని ఎందుకు సమర్పిస్తారో, దీని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే చాలా మందిలో చలి కాలం వదిలి వేసవి కాలం వచ్చే క్రమంలో చాలా రకాల అనారోగ్య  సమస్యలు వస్తాయి. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఉగాది పచ్చడి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఈ పచ్చడి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు:

  • చింతపండు
  •  బెల్లం
  •  వేప
  •  కారం
  • ఉప్పు
  • మామిడి

ఈ పదార్థాల ప్రయోజనాలు:
వేప:

  1. వేప ఆకులు, బెరడు, వేరు, వేప పువ్వు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటన్నింటిని ఆయుర్వద శాస్త్రంలో ఔషధ మూలికలుగా పేర్కొన్నారు.
  2. ఇవి చర్మ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, మధుమేహం, మలేరియా మొదలైన వాటికి దివ్యౌషధంగా పని చేస్తుంది.
  3. మామిడి, చింతపండుతో పాటు వేపను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి బాడీలోని విషపదార్థాలు బయటకి వస్తాయి.

మామిడి:

  1. మామిడి పండ్ల సీజన్ వేసవిలో ప్రారంభమవుతుంది. ఇవి తినడం వల్ల  రక్తనాళాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  2. ప్రతి రోజూ తినడం వల్ల గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ సమస్యల నుంచి దూరం చేస్తుంది.
  3. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రభావవంతంగా సహాయపడుతుంది.

బెల్లం:

  1. బెల్లం తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.
  2. ఇందులో ఉండే గుణాలు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.
  3. ఉగాది పచ్చడిలో ఉపయోగించే బెల్లంలో జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి.
  4. శరీర రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

చింతపండు:

  1. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాల్లో చింతపండు కూడా ఒక్కటి.
  2. ఇది జీర్ణ శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చర్మ  సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
  3. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
  4. అంతేకాకుండా శరీరంలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఉగాది పచ్చడి తయారి పద్ధతి:

  1. ముందుగా ఒక పాత్రలో 5 కప్పుల నీటిని తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల పొట్టు తీసిన మామిడికాయ ముక్కలను వేయాలి.
  2. ఒక టేబుల్ స్పూన్ వేప పువ్వు, మూడు టేబుల్ స్పూన్ బెల్లం వేయాల్సి ఉంటుంది.
  3. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం, రుచికి సరిపడ ఉప్పు కలపండి.
  4. వీటన్నింటి మిక్స్‌ చేస్తే ఉగాది పచ్చడి తయారి పూర్తయినట్లే..

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News