Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన కేసీఆర్ కొడుకు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ‘‘మా నౌకర్లు మాక్కావాలే’’ నినాదంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, రాబోయేది బీజేపీ సర్కారేనని చెప్పారు. సీఎం కొడుకును బర్తరఫ్ తోపాటు పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తామన్నారు.
ఆదివారం నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన బండి సంజయ్.. అనంతరం ప్రసంగించారు. 1400 మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దళితుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకుతో బాధపడుతుంటే.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. ఆయన కొడుకు ముఖ్యమైన మంత్రి అని.. అన్నింటికీ ఆయన కొడుకే మాట్లాడతాడని అన్నారు. కానీ ఆయన శాఖలో జరిగే వైఫల్యాలపై నోరు మెదపడన్నారు.
"కుక్క కరిచి పిల్లలు చనిపోతున్నా, నాలాలో పడి చనిపోతున్నా, అగ్ని ప్రమాదాలు సజీవ దహనమైపోతున్నా పట్టించుకోడు. టీఎస్సీఎస్సీ పేపర్ లీకులోనూ ఆయనే బాధ్యుడు. అందుకే కేసీఆర్ కొడును బర్తరఫ్ చేసేదాకా పోరాడతాం.. ఈరోజు నిరుద్యోగులంతా బీజేపీ చేసే పోరాటాలకు మద్దతిస్తున్నారు. నిరుద్యోగులందరికీ బీజేపీ అండగా ఉంటుంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. మాతో కలిసి రండి. సీఎం కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాడదాం.. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చేదాకా ఉద్యమిస్తాం.. సిట్టింగ్ జడ్జిపై విచారణ జరిగే వరకు పోరాడతాం.. అందులో భాగంగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో ‘‘మా నౌకర్లు మాక్కావాలే’’ నినాదంతో ఉదయం 10 గంటలకు 1 గంట వరకు దీక్ష చేయబోతున్నాం.
టీఎస్సీపీఎస్సీ లీకేజీలో కేసీఆర్ కొడుకు పాత్ర ఉంది. సీఎంవో కుట్ర ఉంది. సీఎంవోలో పనిచేసే పదవీ విరమణ పొందిన అధికారి ఈ కుట్రలో భాగస్వామి. పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర ఉంది. అయినా కిందిస్థాయి వాళ్లపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. చర్చను దారి మళ్లించేందుకు బీజేపీని బదనాం చేయాలనుకుంటున్నారు. వీటిపై ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలు వివరించాలి. దళిత మోర్చా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి.." అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Also Read: Ravindra Jadeja: ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన రవీంద్ర జడేజా.. నిజమేనా..!
Also Read: AP Weather Report: నేడు ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి