Tripura Meghalaya Nagaland Assembly Election Results: మన దేశంలో ఎన్నికలు అంటేనే ఓ క్రేజ్. నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచి ఫలితాలు వచ్చే వరకు ఆ ఉత్సాహమే వేరు. మొదటి నుంచి ఎంతో సంబరపడిపోయినా.. తీరా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే డీలా పడిపోవడం ఖాయం. ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోతే ఓ మాదిరి బాధ ఉంటుందేమో కానీ.. గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమిపాలైతే ఆ బాధ వర్ణించచలేం. గురువారం త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. కొన్ని చోట్ల అభ్యర్థులు విజయం కోసం చెమటోడ్చారు. స్వల్ప మెజార్టీతో గెలిచిన నేతలు ఊపిరి పీల్చుకుంటుండగా.. విజయం చేతిలోకి వచ్చినట్లే జారిపోయిన నాయకులు మాత్రం కన్నీటి పర్యాంతం అవుతున్నారు.
10 ఓట్ల తేడాతో ఓటమి..
మేఘాలయలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. బీజేపీ, ఎన్‌పీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారు అయిపోయింది. 60 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 59 స్థానాలకు ఓట్లు పోలయ్యాయి. రాజ్‌బాల నియోజకవర్గంలో కేవలం 10 ఓట్ల తేడాతో గెలుపు ఓటమి తేలిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మిజానూర్ రెహమాన్ కాజీ ప్రత్యర్థి అబ్దుస్ సలేహ్‌పై 10 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అదేవిధంగా సోహ్రా నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి గావిన్ మిగ్యుల్ మేలిమ్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి టిటోస్టార్ వెల్ చైనీపై 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. దాదేంగ్రేలో గెలిచిన అభ్యర్థి కూడా కేవలం 18 ఓట్ల తేడాతోనే విజయం దక్కించుకున్నారు.
మైలెం నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి రోనీ వి లింగ్డో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ అభ్యర్థి ఐబండప్లిన్ ఎఫ్.లింగ్డోపై 38 ఓట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకున్నారు. అమ్లారెం నియోజకవర్గ అభ్యర్థి కూడా 57 ఓట్లతోనే విక్టరీ సాధించారు.
7 ఓట్లతో తేడాతో గెలుపు
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఉత్కంఠను రేపాయి. అక్కడి ప్రజలు 59 సీట్లలో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమికి పెద్దపీట వేశారు. చివరి క్షణం వరకు విజయంపై ఆశలు పెట్టుకున్న స్వతంత్ర అభ్యర్థి కేవలం 7 ఓట్లతో ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. పశ్చిమ అంగామి నియోజకవర్గం ఎన్‌డీపీపీ అభ్యర్థి సల్హుతును క్రూసే కేవలం ఏడు ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కెనిజాఖో న్ఖర్రోపై గెలుపు సొంతం చేసుకున్నారు. నకిలీ నియోజవర్గంలో 49 ఓట్ల అంతరంతో అభ్యర్థి విజయం సాధించారు. తాపీ స్థానంలో 82 ఓట్ల తేడాతో అభ్యర్థి గెలుపొందారు.
Also Read: Bank Employees Holidays: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రెండు వీక్లీఆఫ్‌లు..?
Also Read: Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వానికి జనసేన సపోర్ట్.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి