Cancer Warning Signs: శరీరం అధిక ఉష్ణోగ్రత కేన్సర్ ప్రారంభ లక్షణమా, ఎలా గుర్తించాలి

Cancer Warning Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ కేన్సర్ ప్రమాదకరంగానే ఉంది. సకాలంలో గుర్తించలేకపోతే కేన్సర్ ప్రాణాంతకమౌతుంది. కేన్సర్‌ను సకాలంలో గుర్తించాలంటే కొన్ని సంకేతాలు ముందుగానే వెలువడుతాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2023, 08:08 PM IST
Cancer Warning Signs: శరీరం అధిక ఉష్ణోగ్రత కేన్సర్ ప్రారంభ లక్షణమా, ఎలా గుర్తించాలి

కేన్సర్..ఆ పదం వింటేనే ప్రతి ఒక్కరికీ ఒళ్లు జలదరిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ ముప్పు పెరుగుతోంది. ప్రపంచంలో సంభవించే అత్యధిక మరణాల్లో కేన్సర్ కూడా ఓ ప్రధాన కారణం. కేన్సర్ ప్రారంభదశలో చాలా రకాల సంకేతాలు ఇస్తుంది. ఈ లక్షణాల్ని పట్టించుకోకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. 

ముఖ్యంగా శరీరం ఉష్ణోగ్రత పెరగడం కూడా కేన్సర్ ఇతర భాగాలకు విస్తరిస్తుందనేందుకు సంకేతం అవుతుంది. ట్యూమర్ సమీపంలోని టిష్యూని ఆక్రమించినప్పుడు శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. వైద్య పరిభాషలో పైరోక్సియాగా పిలుస్తారు. పైరోక్సియా అనేది కేన్సర్ రోగుల్లోనే ఉంటుంది. కేన్సర్ విస్తరిస్తుందనేందుకు లేదా తదుపరి దశలో ఉందనేందుకు సంకేతమిది. యూకేకు చెందిన కేన్సర్ రీసెర్చ్ సంస్థ ప్రకారం ఇది చాలా అసౌకర్యమైంది. ఆందోళన కల్గించే అంశం. పైరోక్సియా అన్ని రకాల కేన్సర్‌లలో ఉండే ఓ సాధారణ లక్షణం. ఈ లక్షణం బ్లడ్ కేన్సర్ వంటి లుకేమియా, లింఫోమియాలో ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ కేన్సర్, లంగ్స్ కేన్సర్, బౌల్ కేన్సర్ ఉన్నప్పుడు జ్వరం ఉండే అవకాశాలు తక్కువే. అయితే కేన్సర్ రీసెర్చ్  ప్రకారం జ్వరం కూడా రావచ్చు. ఒకవేళ వారిలోని ట్యూమర్..లివర్ వరకూ విస్తరిస్తే జ్వరం వస్తుంటుంది. శరీరంలో ఎక్కడో చోట కేన్సర్ ఆటంకం కల్గిస్తుందని అర్ధం.

జ్వరం ఎందుకు వస్తుంటుంది

కొన్ని రకాల కేన్సర్‌లు ఇతరవాటితో పోలిస్తే అధిక జ్వరం ఎందుకు వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కొన్ని వ్యాధులు టాక్సిన్స్ ఉత్పత్తి చేస్తాయి. అందుకే జ్వరం వస్తుందని అంటారు. కేన్సర్ జ్వరంలో పైరోజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. పైరోజెన్ అనేది జ్వరాన్నిప్రేరేపించే పదార్ధం. 

వైద్యుని సంప్రదించడం

జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. సంక్రమణ లేదా జ్వరానికి తక్షణ చికిత్స అనేది భవిష్యత్తులో తీవ్రమైన సమస్యల్ని నియంత్రించవచ్చు. కేన్సర్ రోగుల్లో కన్పించే ఇతర ప్రధాన లక్షణాల్లో అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం, బలహీనత, కురుపులు,సెగ్గెడ్డలు, ఛాతీలో మంట, కడుపులో నొప్పి.

Also read: Weight Loss Tips: ఈ పదార్ధాలకు దూరంగా ఉంటే..నెలరోజుల్లోనే స్థూలకాయానికి చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News