Pomegranate health benefits: మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో దానిమ్మ ఒకటి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ తినడం వల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో వ్యాధులను ఇది రాకుండా అడ్డుకుంటుంది. ఈ పండును రోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్లు మనల్ని హెల్తీగా ఉంచుతాయి. ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
దానిమ్మ ప్రయోజనాలు
** దానిమ్మ పండులో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఇది తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది.
** దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మీరు రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు.
** ఈ ప్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
** దానిమ్మ తినడం వల్ల ఆజీర్తి, ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
** ఇది రక్తం గడ్డకట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మెదడును చురుకుగా ఉంచుతుంది.
** ఈ పండు డు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: Walnuts Benefits: వాల్ నట్స్ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు..!
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook