అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల మద్దుతు కూడగట్టేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం టీడీపీ ఎంపీలు.. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను కలిశారు. ఈ సందర్భంగా రేపు (శనివారం) చర్చకు వచ్చే అవిశ్వాస తీర్మానాకి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించారు. ఓటింగ్ సమమంలో ఆప్ పార్టీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలుస్తారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఏకతాటిపై ప్రతిపక్షాలు
ఈ భేటీ నంతరం టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనచౌదరీ మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దుతు కోసం కేజ్రీవాల్ ను కలిశామన్నారు. కేజ్రీవాల్ తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మోడీ సర్కార్ పై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉంటాయని.. ఓటింగ్ సమయంలో పూర్తి స్థాయి మద్దుతు తెలుపుతాయని టీడీపీ ఎంపీ సుజనాచౌదరీ ఆశాభావం వ్యక్తం చేశారు.