India beat Pakistan in Womens T20 World Cup 2023: మహిళల టీ20 వరల్డ్‌కప్ 2023లో భారత్ శుభారంభం చేసింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. భారత స్టార్ బ్యాటర్ జెమీమీ రోడ్రిగ్స్ (53 నాటౌట్; 38 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (33), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రీచా ఘోష్ (31 నాటౌట్) రాణించారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు పడగొట్టింది.
150 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు షషాలీ వర్మ, యస్తిక భాటియా (17) శుభారంంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు కీలక 31 పరుగులు జోడించారు. షఫాలీ, హర్మన్‌ప్రీత్ కౌర్ (16)లను ఔట్ చేసిన నశ్ర సంధు.. భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సంమయంలో జెమీమాతో జత కలిసిన రీచా ఘోష్.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. సాధించాల్సిన రన్‌రేటు 10 పైనే ఉండడంతో బ్యాట్ జులిపించారు. దాంతో భారత్ సునాయాస విజయం అందుకుంది.
.@JemiRodrigues scored a stunning 5⃣3⃣* in the chase & bagged the Player of the Match award as #TeamIndia commenced their #T20WorldCup campaign with a win over Pakistan 🙌 👏
Scorecard ▶️ https://t.co/OyRDtC9SWK #INDvPAK pic.twitter.com/JvwfFtMkRg
— BCCI Women (@BCCIWomen) February 12, 2023
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ (68 నాటౌట్; 55 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసింది. మరో బ్యాటర్ అయేషా నసీమ్ (43 నాటౌట్; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఓపెనర్ జవేరియా ఖాన్ (8), మునీబ ఆలీ (12), నిడా దార్ (0) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్స్ తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు. విజయంతో మెగా టోర్నీని భారత్ ఘనంగా ఆరంభించింది.
Also Read: Chicken Price: ఆల్‌టైం రికార్డు.. కేజీ చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
Also Read: Sonal Chauhan Pics: పొట్టి డ్రెస్‌లో సోనాల్ చౌహాన్.. అద్దం ముందు అందాలు ఆరబోసిన హాట్ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.