Weight Loss Mistakes During Exercise: ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు భారీ వ్యాయామాలు యోగ ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఇటీవల కాలంలో వ్యాయామాలతో పాటు యోగా చేసిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణాలేంటంటే జిమ్ చేసే క్రమంలో కొన్ని తప్పుడు నియమాలు పాటిస్తున్నారు. అయితే దీనివల్ల కూడా శరీర బరువు తగ్గలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీర భవన సులభంగా తగ్గించుకోవడానికి జిమ్ చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం కార్డియో వ్యాయామాలు చేస్తున్నారా.?
బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లే వారిలో కార్డియో వ్యాయామమే చేస్తున్నారు. ఇదే చేయడమే కాకుండా అన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పరిమితికి మించి వ్యాయామం చేస్తున్నారు:
ప్రస్తుతం చాలామంది పరిమితికి మించి యోగా వ్యాయామాలు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డైటీషియన్లు నిపుణుల సలహాలు తీసుకొని వ్యాయామాలతో పాటు యోగా చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. లేకపోతే దాని ప్రభావం ఎముకలపై పడి తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు.
బరువు తగ్గే క్రమంలో ఎంతసేపు వ్యాయామం చేయాలో తెలుసా?:
బరువు తగ్గే క్రమంలో కొంతమంది 17 నుంచి 25 నిమిషాల పాటు మాత్రమే వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేరని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గడానికి తప్పకుండా 40 నుంచి 50 నిమిషాల వరకు తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
కేలరీల విషయంలో కూడా శ్రద్ధ వహించండి:
చాలామంది బరువు తగ్గే క్రమంలో కేలరీలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. వ్యాయామం చేసే క్రమంలో ఇలాంటి ఆహారాలను తీసుకోవడం మంచిదే అయినప్పటికీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Disha Patani Pics : చెక్కిన శిల్పంలా ఉంది!.. ఒంపుసొంపులు కనిపించేలా దిశా పటానీ అందాల ప్రదర్శన
Also Read: Deva Katta : ఆ స్క్రిప్ట్ నాదే.. బీర్ బాటిల్స్ నావి కాదు.. దేవా కట్టా పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి