Veera Simha Reddy Collections: బాక్స్ ఆఫీస్ ఊచకోత అంటే ఇదేనేమో.. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్!

Veera Simha Reddy 1st Day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయి సూపర్ హిట్ టాక్ దక్కించుకోగా మొదటి రోజు ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం. 

Last Updated : Jan 13, 2023, 03:28 PM IST
Veera Simha Reddy Collections: బాక్స్ ఆఫీస్ ఊచకోత అంటే ఇదేనేమో.. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్!

Veera Simha Reddy 1st Day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయి సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. వీర సింహారెడ్డి మొదటిరోజు వసూళ్ల వర్షం కురిపించింది అనే చెప్పాలి. ఒకరకంగా నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలు అయితే తెచ్చిపెట్టింది.

వీర సింహారెడ్డి సినిమా వసూళ్ల విషయంలో ఇప్పటికే 50 కోట్లకు పైగా గ్రాస్ లభించే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి కానీ ఫైనల్ గా లెక్కలు బయటకు వచ్చేసరికి అసలు ఎంత సంపాదించింది అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.  ఇక ట్రేడ్ వర్గాల వారి లెక్కల ప్రకారం ఈ సినిమా నైజాం ప్రాంతంలో ఐదు కోట్ల 21 లక్షలు సంపాదించగా సీడెడ్ ప్రాంతంలో ఐదు కోట్ల 55 లక్షలు సంపాదించింది.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెండు కోట్ల 53 లక్షలు, ఈస్ట్ గోదావరి కోటి 73 లక్షలు, వెస్ట్ గోదావరిలో రెండు కోట్ల ఎనిమిది లక్షలు, గుంటూరులో మూడు కోట్ల 60 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటి 65 లక్షలు, నెల్లూరు జిల్లాలో ఒక కోటి 20 లక్షలు వెరసి ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ మొత్తం మీద 23.35 కోట్ల షేర్, 39.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించింది.

మరో పక్క కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి కోటి 75 లక్షల సంపాదిస్తే ఓవర్సీస్ లో మాత్రమే మూడు కోట్ల 95 లక్షల సంపాదించింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 29 కోట్ల ఐదు లక్షల రూపాయలు షేర్ వసూలు చేయగా 50 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అయితే సినిమా మేకర్స్ మాత్రం అధికారికంగా 54 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సినిమా సాధించింది అంటూ అధికారికంగా ప్రకటించారు. 
Also Read: Waltair Veerayya OTT Release: అప్పుడే OTTలో వాల్తేరు వీరయ్య రిలీజ్... ఎందులో అంటే?

Also Read: Balakrishna Fans Arrested: వీర సింహా రెడ్డి థియేటర్ వద్ద అత్యుత్సాహం..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 
 

Trending News