ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ వేదిక జొమాటో సంస్థ కో ఫౌండర్‌గా, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న గుంజన్ పాటీదార్ రాజీనామా మార్కెట్లో షాక్ కల్గిస్తోంది. సంస్థ తొలి ఉద్యోగుల్లో ఒకరైన పాటీదార్..చాలాకాలం సంస్థకు టెక్నాలజీ సేవలు అందించారు.
గత పదేళ్లుగా జొమాటో సంస్థలో టెక్ లీడర్షిప్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జొమాటో సంస్థ సీటీవో గుంజన్ పాటీదార్ రాజీనామా చేశారు. సంస్థలో 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన గుంజన్ పాటీదార్ సంస్థ అభివృద్ధిలో కీలకమైన వ్యక్తి. ఇటు జొమాటో సంస్థ కూడా ఆయన రాజీనామాపై అదే విధంగా స్పందించింది. కంపెనీను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమైందని తెలిపింది. అయితే రాజీనామా ఎందుకు చేశారనే కారణాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.
జొమాటోలో వరుస రాజీనామాలు
గత ఏడాది నవంబర్ నెలలో కంపెనీకు చెందిన మరో కో ఫౌండర్, మోహిత్ గుప్తా కూడా రాజీనామా చేశారు. గుప్తా నాలుగున్నరేళ్ల క్రితం సంస్థలో చేరారు. 2020లో కంపెనీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ సీఈవో నుంచి కో ఫౌండర్‌గా పదోన్నతి పొందారు. గత ఏడాది మరో వ్యక్తి హెడ్ ఆఫ్ న్యూ ఇనీషియేటివ్‌గా ఉన్న రాహుల్ గంజూ రాజీనామా చేశారు. అంతేకాకుండా..మాజీ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్సిటీ ఛీఫ్ సిద్ధార్ధ్ ఝావర్, కో ఫౌండర్ గౌరవ్ గుప్తాలు కూడా ఇటీవలే కంపెనీని వీడారు.
టెక్ షేర్ల మాంద్యం కారణంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 2022 సంవత్సరంలో నష్టాలు చవిచూసింది. బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర 162 రూపాయల్నించి 50 శాతం కంటే తక్కువకు పడిపోయి..60.30 రూపాయలకు క్లోజ్ అయింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జొమాటో నష్టం గత ఆర్ధిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి 434 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 62.20 శాతం పెరిగి 1661.3 కోట్ల రూపాయలకు చేరుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook