Zika Virus Symptoms: కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటే జికా వైరస్ సోకుతుందా ?.. జికా వైరస్ లక్షణాలు

Zika Virus Symptoms: చిన్నారికి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలోనే బాలిక మూత్రం, రక్త నమూనాలను పూణేలోని ల్యాబొరేటరీకి పంపించారు. ఈ వైద్య పరీక్షల్లోనే బాలికకు జికా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది.

Written by - Pavan | Last Updated : Dec 13, 2022, 03:54 PM IST
  • కర్ణాటకలో వెలుగుచూసిన తొలి జికా వైరస్ కేసు
  • జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఏంటో తెలుసా ?
  • కండోమ్ లేకుండా సెక్సులో పాల్గొంటే జికా వైరస్ సోకుతుందా ?
Zika Virus Symptoms: కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటే జికా వైరస్ సోకుతుందా ?.. జికా వైరస్ లక్షణాలు

Zika Virus first case in Karnataka : బెంగళూరు : కర్ణాటకలో మొట్టమొదటి జికా వైరస్‌ కేసు నమోదైనప్పటి నుంచే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికలో జికా వైరస్ ని గుర్తించిన కర్ణాటక సర్కారు.. జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ మరింత వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. బాలికకు నవంబరు 13న జ్వరం రావడంతో సింధనూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ జరిరిన వైద్య పరీక్షల్లో బాలికకు డెంగ్యూ జ్వరం సోకినట్లు గుర్తించారు. అనంతరం మెరుగైన వైద్య సహాయం కోసం చిన్నారిని విజయనగర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)కు తరలించారు. నవంబర్‌ 15 నుంచి 18 వరకు విమ్స్ లో చిన్నారికి చికిత్స అందించారు. 

చిన్నారికి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించే క్రమంలోనే బాలిక మూత్రం, రక్త నమూనాలను పూణేలోని ల్యాబొరేటరీకి పంపించారు. ఈ వైద్య పరీక్షల్లోనే బాలికకు జికా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. కర్ణాటకలో జికా వైరస్‌పై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ స్పందిస్తూ.. కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు వ్యాపించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. 

జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
జ్వరం
ఒళ్లు నొప్పులు
కీళ్ల నొప్పి
దద్దుర్లు
కండ్లకలక

జికా వైరస్ నివారణ, వ్యాప్తి..
ఏడెస్ అనే జాతికి చెందిన దోమ కాటు ద్వారా జికా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది.
ఈ దోమలు పగలు, రాత్రి సమయంలో కుడుతాయి.
జికా వైరస్ గర్భిణీ స్త్రీ నుండి ఆమెలోని కడుపులోని పిండానికి వ్యాపిస్తుంది. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ సోకితే.. అది పుట్టబోయే శిషువులో లోపాలకు దారితీసే ప్రమాదం ఉంది.
కండోమ్ లేకుండా సెక్సులో పాల్గొనడం లేదా రక్త మార్పిడి ద్వారా కూడా జికా వైరస్ వ్యాపిస్తుంది.
ప్రస్తుతానికి జికా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ని నేరుగా నయం చేసేందుకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

ఇది కూడా చదవండి : Hair Transplant Facts: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రాణాలు తీస్తుందా ?

ఇది కూడా చదవండి : Foods and Headache: భరించలేని తలనొప్పి వేధిస్తుందా ? ఇవి తింటున్నారా ?

ఇది కూడా చదవండి : Almonds Health Benefits: బాదాంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News