Superstar Krishna's mortal remains not going to Gachibowli Stadium: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అవడంతో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు నరేష్. ఈ విషయం నిన్న ఉదయం బయటకు వచ్చింది. అయితే ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని ప్రస్తుతం పరిస్థితి ఏ మాత్రం బాలేదని వైద్యులు నిన్న మధ్యాహ్నం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు. 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని అప్పుడే ప్రకటించారు వైద్యులు.
అయితే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కావడంతో కృష్ణ ఈరోజు తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల 9 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు.. అయితే కృష్ణ పార్థివ దేహాన్ని ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన నివాసమైన విజయకృష్ణ నివాసం అనే భవనానికి తరలించారు. ఈ భవనాన్ని ఆయన, విజయనిర్మల ఇద్దరూ కలిసి చాలా ఇష్టపడి నిర్మించుకున్నారు. తమ అభిరుచికి తగినట్లుగానే ఇంటిలోని ప్రతి అణువణువు తీర్చిదిద్దారు. ఇప్పటికే కృష్ణ పార్థివ దేహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పలువురు స్టార్ హీరోలు సందర్శించారు. రేపు ఉదయం వైఎస్ జగన్ కూడా సందర్శించబోతున్నారు.
ఇక ఆయన అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ముందుగా గచ్చిబౌలి తరలించాలని భావించారు. పెద్ద ఎత్తున అభిమానులు ఆయనను కడసారి చూసుకునేందుకు అక్కడ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్థివ దేహం వస్తుందని భావించి గచ్చిబౌలి స్టేడియంకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ అభిమాన నటుడు చివరి చూపు చూసేందుకు వారంతా స్టేడియం బయట బారులు తీరారు. ఈ నేపద్యంలో స్టేడియం వద్ద పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. స్టేడియంలో లోపల బయట పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. మరి కాసేపట్లో కృష్ణ పార్థివ దేహం గచ్చిబౌలి స్టేడియం కు చేరుకుంటుంది అనుకుంటున్న సమయంలో కృష్ణ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు రాత్రికి సూపర్ స్టార్ కృష్ణ నివాసంలోనే ఆయన దేహాన్ని ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎంతో ఇష్టపడి ప్రేమతో కట్టుకున్న అదే నివాసంలో ఆయన దేహాన్ని అంత్యక్రియల వరకు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు రేపు ఉదయం కొద్దిసేపు గచ్చిబౌలి స్టేడియంకు తీసుకువెళ్లాలి అని భావించినా సరే తర్వాత మరలా అక్కడికి కూడా వెళ్లడం ష్టం లేదని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇంటి నుంచి నేరుగా పద్మాలయ స్టూడియోకి తీసుకువెళ్లి అక్కడ కొన్ని పూజలు జరిపి ఆ తర్వాత ఆయన పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తీసుకు వెళ్లబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లో అభిమానుల సందర్శనార్థం సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఉంచబోతున్నారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.
Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Also Read: Krishnam Raju wife: కలిసే సినిమాలు చేశారు.. కలిసి చనిపోవాలని అనుకున్నారేమో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook