What if Kantara Film Was Made By Tollywood Makers: కన్నడలో ఎప్పటి నుంచో ఎంతోమంది సూపర్ హీరోలు, స్టార్ హీరోలు ఉండేవారు. కానీ కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకోవడం మాత్రం కేజిఎఫ్ తర్వాతే మొదలైంది అని చెప్పొచ్చు. కేజీఎఫ్ తర్వాత వారి నుంచి వచ్చిన చార్లీ సినిమా అలాగే గరుడ గమన వృషభ వాహన వంటి సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇదే దారిలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన కాంతార సినిమా ఇప్పుడు కన్నడ సహా తెలుగు, మలయాళం, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సారించింది.
ఈ సినిమా కథ, కథనం కొత్తగా ఏమీ లేవు కానీ తీసుకున్న నేపథ్యం కాస్త కొత్తగా ఉంది దైవ నర్తకులు, అడవి చుట్టూ అల్లుకున్న భూములు, ఆ భూములు కొట్టేసే ప్లాన్ ఇలా తెలిసిన కథ అయినా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. చివరి 20 నిమిషాల వరకు సాదాసీదాగానే సాగిపోతూ పెద్దగా ఏమీ అంచనాలు లేని సమయంలో చివరి 20 నిమిషాలకు క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి మళ్లీ ఇలాంటి పాత్రలో నటించే అవకాశం దొరుకుతుందో లేదో అనే అంతగా నటించి విమర్శకులు మెప్పు పొందే ప్రయత్నం చేశారు. దాదాపుగా ఆ 20 నిమిషాల పాటు ప్రేక్షకులు కూడా ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒకవేళ ఇదే సినిమాని మన తెలుగు దర్శకుడు తెలుగు హీరోతో చేసి ఉంటే దాన్ని నిజంగానే మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. నిజానికి కాంతారా సినిమాని ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చుకుంటున్నారు, దానికి అంత సీన్ లేదని కొంతమంది భావిస్తున్నారు. కానీ మెజారిటీ అభిప్రాయం ప్రకారం చూస్తే ఆ సినిమా హిట్ కొట్టేసినట్టే. తెలుగులో కూడా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. మరో 10- 15 కోట్లు సంపాదించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదే సినిమాని తెలుగులో గనక తెలుగు దర్శకుడు తెలుగు హీరో చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించే వారు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగులో ఆ స్థాయిలో నటీనటులు లేరా అంటే ఎందుకు లేరు ఉన్నారు. ముఖ్యంగా ఈ పాత్ర తెలుగువారితో చేయించాల్సి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ గా సరిపోతాడనే వాదన ఉన్నా తెలుగులో ఎన్టీఆర్ తో పోటాపోటీగా నటించగలరు కూడా ఉన్నారు. వారు కూడా ఈ పాత్రలో ఒదిగి పోగల అవకాశం ఉంది కానీ మన తెలుగు హీరోలు కనుక ఈ సినిమా ఈ పాత్ర చేసి ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఏదో ఒక వంక పెట్టి పక్కన పెట్టే వారేమో అనే వాదన వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Also Read: Balakrishna vs Chiranjeevi: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..సంక్రాంతి పోటీ ఇక లేనట్టే.. ఎందుకంటే?
Also Read: Kantara Telugu Movie Collections : కాంతారా రెండో రోజు కలెక్షన్లు.. కుమ్మి అవతలపారేసిందిగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook