OSCAR Awards: విఖ్యాత సినిమా అంటే ప్రామాణికం ఆస్కార్ అవార్డు. ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుకు అందరూ ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ ఎంపిక కాలేదు. మరో సినిమా నామినేట్ అయింది..
ఆర్ఆర్ఆర్ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన సినిమా. రాజమౌళి స్థాయిని మరింతగా హైప్ చేసిన సినిమా. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల నటన, గ్రాఫిక్స్, భారీ ఖర్చుతో సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. బహుశా అందుకే చాలామంది ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి నామినేట్ కావచ్చని అంచనా వేశారు. గత 4-5 రోజులుగా మీడియాలో ఇదే ప్రచారం సాగింది. ఇండియా నుంచి ఆస్కార్‌కు ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిపోయిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
కానీ అందరి ఆశల్ని వమ్ముచేస్తూ ఇండియా నుంచి మరో సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది. లాస్ట్ ఫిల్మ్ షో చలో అనే గుజరాతీ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
లాస్ట్ ఫిల్మ్ షో చలో కధేంటి
బెస్ట్ ఫిల్మ్ కేటగరీలో ఇండియా నుంచి ఈ సినిమా నామినేట్ అయింది. దర్శకుడు నలిన్ తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చిన్నప్పుుడు సినిమాలపై ఎలా ఆకర్షితుడయ్యాడు, ఎలా ఇష్టాన్ని పెంచుకున్నాడనే కాన్సెప్ట్‌తో అత్యంత హృద్యంగా సినిమా తెరకెక్కింది. 2023 ఆస్కార్ బరిలో ఉంటుంది.
ఈ సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా దర్శకుడు ఆవిష్కరించాడు. తొమ్మిదేళ్ల బాలుడి కధ ఇది. లాస్ట్ ఫిల్మ్ షో ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు సాధించింది. దేశంలో అక్టోబర్ 14న విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్ ఎందుకు నామినేట్ కాలేదు
ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం అంటే అంత సులభమేం కాదు. కధ, కథనం అత్యంత సహజంగా ఉండాలి. గ్రాఫిక్స్ కంటే సహజత్వం ఎక్కువగా ఉండాలి. చక్కని కాన్సెప్ట్‌ను ఎలా తెరకెక్కించారనేది ప్రధానంగా పరిశీలిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నా..సహజత్వం లోపింంచింది.
Also read: Janhvi Kapoor Hot Pics: జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook