Manchu Manoj - Bhuma Mounika Reddy: పొలిటికల్ లీడర్స్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి?

Manchu Manoj Second Marriage With Bhuma Mounika Reddy: మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. అది కూడా భూమా నాగిరెడ్డి -భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో అని తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 4, 2022, 10:49 PM IST
Manchu Manoj - Bhuma Mounika Reddy: పొలిటికల్ లీడర్స్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి?

Manchu Manoj Second Marriage With Bhuma Mounika Reddy: సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు, విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో అనేకమంది నటీనటులు ప్రేమించి వివాహం చేసుకున్నారు, తర్వాత విడాకులు తీసుకున్నారు. అలాగే మన హీరోలు బయట వారిని ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు తీసుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కూడా మంచు విష్ణు వివాహంలో పరిచయమైన ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరు 2019లో విడాకులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏకంగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన యువతిని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం తెరమీదకు వచ్చింది. ఆమె మరెవరో కాదు భూమా నాగిరెడ్డి -భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డి అని తెలుస్తోంది. తాజాగా మౌనిక రెడ్డితో కలిసి మంచు మనోజ్ హైదరాబాద్లో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం మళ్ళీ తెర మీదకు వచ్చింది.

ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సొంతంగా ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసిన మంచు మనోజ్ అందులోనే అహం బ్రహ్మాస్మి అనే ఒక పాన్  ఇండియా లెవల్ సినిమా తాను హీరో గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్కడి వరకు వచ్చింది అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకోబోతున్నారా లేక ఇది కేవలం ప్రచారం గానే నిలిచిపోతుందా అనేది తెలియాల్సి ఉంది. భూమా మౌనిక కూడా గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుని తర్వాత ఆయనకు దూరమైంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భూమా మౌనిక రెడ్డి ఎంగేజ్మెంట్ కి మంచు ఫ్యామిలీ అటెండ్ అవ్వడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు అదే భూమా మౌనికను మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. కేవలం కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే కలిసి విఘ్నేశ్వరుని దర్శించుకున్నారా? లేక నిజంగానే రెండో వివాహం వ్యక్తులు చేసుకోబోతున్నారా? అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. 

Also Read: Bigg Boss Telugu 6: హౌస్ లో ఒక్కరొక్కరిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్స్.. ఎవరెవరు ఉన్నారంటే?

Also Read: Huma Qureshi Hot Photos: గ్రీన్ డ్రెస్లో హుమా ఖురేషీ వలపు వల

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News