Delhi Liquor Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ. తాజాగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ చేసింది. సిసోడియా బ్యాంక్ లాకర్లను తెరిచారు సీబీఐ అధికారులు. గజియాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోని మనీష్ సిసోడియా లావాదేవీలను పరిశీలించారు. తన బ్యాంక్ లాకర్లు తెరిచిన సమయంలో సీబీఐ అధికారులతో పాటు బ్యాంకుకు వెళ్లారు మనీష్ సిసోడియా. గతంలోనే సిసోడియా ఇల్లు, కార్యాలయంతో పాటు అతని సన్నిహితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.
ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లింకులు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర స్పష్టంగా ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఆరోపించడం కలకలం రేపింది. లిక్కర్ పాలసీనీ తెలంగాణ వ్యక్తులే ఢిల్లీలోని ఓ హోటల్ లో కూర్చుని తయారు చేశారని.. ఇదంతా తెలంగాణ మద్యం వ్యాపారులు, ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే జరిగిందని చెప్పారు. అయితే లిక్కర్ స్కామ్ లో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు కవిత. లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ కూతురును కాబట్టే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యర్థులపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. బట్టకాల్చి మీద వేస్తుందని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఏ విచారణకైనా తాను సిద్దమని కవిత స్పష్టం చేశారు.
తనపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాదు.. తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలపై పరువు నష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ కవిత కేసులు దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. అయితే కవిత వేసిన పరువు నష్టం దావా కేసుపై స్పందించిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి సీబీఐ నోటీసులు ఇస్తుందని కామెంట్ చేశారు. తాజాగా సీబీఐ దూకుడు పెంచడం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్లు తెరవడం చర్చగా మారింది. త్వరలోనే కేసుతో సంబంధం ఉన్న అందరికి సీబీఐ నోటీసులు వస్తాయనే చర్చ సాగుతోంది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వనుందా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Read Also: AP POLITICS: ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్.. టీడీపీ పొత్తుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి