/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Papaya Health Benefits: సాధారణంగా అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువగా పండ్లు తింటుంటాం. ప్రత్యేకించి బొప్పాయి ఆ పండ్లలో కచ్చితంగా ఉండాల్సిందే. బొప్పాయిలో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయంటారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

బొప్పాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతులేనివనే చెప్పాలి. మెరుగైన ఆరోగ్యం కోసం బొప్పాయి తీసుకోవడమనేది అనాదిగా వస్తున్నదే. ఆయుర్వేదంలో కూడా బొప్పాయి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇంకా ఇతర పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలుండటం విశేషం. ఇందులో విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి మినరల్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. 

హార్ట్ ఎటాక్ నుంచి సంరక్షణ

బొప్పాయయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి. బొప్పాయిలో ఉండే ఫోలేట్ కారణంగా రక్త నాళాలు పాడవకుండా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం మొత్తం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫలితంగా వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

డయాబెటిస్ రోగులు ప్రయోజనం

డయాబెటిస్ రోగులు చాలావరకూ పండ్లను తినకూడదు. ఎందుకంటే చాలా పండ్లకు గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పండ్లు తింటే షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. బొప్పాయిలో మాత్రం గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు బొప్పాయి హాయిగా తినవచ్చు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభదాయకం.

ఇమ్యూనిటీ బూస్ట్

బొప్పాయి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటిమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక బొప్పాయితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే..వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బలోపేతమౌతుంది. మల బద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు దూరమౌతాయి.

ఎనిమియాకు చెక్

బొప్పాయిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎనీమియా వంటి వ్యాధుల్లో ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ తినడం వల్ల ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలు దూరమౌతాయి. బొప్పాయితో ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ కే ఎముకల్లోని కాల్షియం కొరతను తీరుస్తుంది. బొప్పాయి తినడం వల్ల ఎముకలకు సంబంధించిన నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆర్ధరైటిస్ వ్యాధులు దూరమౌతాయి.

Also read: Tulsi Tea Remedies: తులసి ఆకుల టీతో ఆరోగ్య ప్రయోజనాలు, స్థూలకాయానికి చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Papaya Health Benefits help in immunity, digestion, diabetes anemia, skin care, heart diseases and bone strength
News Source: 
Home Title: 

Papaya Health Benefits: బొప్పాయిలో దాగున్న అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Papaya Health Benefits: బొప్పాయిలో దాగున్న అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Caption: 
Papaya Health Benefits ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Papaya Health Benefits: బొప్పాయిలో దాగున్న అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, August 28, 2022 - 22:07
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
81
Is Breaking News: 
No