Healthy Heart Tips: రోజురోజుకు చాలా మందిలో గుండె సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనారోగ్య ఆహారపు అలవాట్ల వల్ల, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పలువురి గుండె సమస్యలు ఆధునిక జీవన శైలి కారణంగా కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. అయితే గుండెను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..అంతేకాకుండా పలు రకాల చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం:
1. చురుకుగా ఉండండి:
సాధరణంగా వ్యాయామం చేసినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే శారీరిక శ్రమ చాలా అవసరం. కావున గుండె ఆరోగ్యంగా ఉండానికి ప్రతి రోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. ప్రతి రోజూ కనీసం 75 నుంచి 80 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే.. గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలైన తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.
2. వీటిని మాత్రమే తినాలి:
కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులను మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం కూరగాయలు, గింజలు, చేపల వంటి ఆహారాలు తీసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి.
3. లేజీనెస్ వదిలేయండి:
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున ఇంతకముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదు.
4. ధూమపానం మానుకోండి:
ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం. వీటికి ఒక్క సారి అలవాటు పడితే.. ఇది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ధూమపానం చేయడం వల్ల కొందరిలో హార్ట్ డిసీజ్లకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.
Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook