Praveen: చీకోటి ప్రవీణ్‌ తో లింకులున్న నేతలు వీళ్లేనా? క్యాసినో దందా చీకటి కోణాలు ఇవిగో...!

Casino Chikoti Praveen: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 

Written by - Srisailam | Last Updated : Jul 29, 2022, 12:33 PM IST
  • క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు
  • రాజకీయ, సినీ ప్రముఖులకు లింకులు
  • వైసీపీ నేతల హస్తం ఉందంటున్న టీడీపీ
Praveen: చీకోటి ప్రవీణ్‌ తో లింకులున్న నేతలు వీళ్లేనా? క్యాసినో దందా చీకటి కోణాలు ఇవిగో...!

Casino Chikoti Praveen:కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ తారలతో చీకోటి ప్రవీణ్ కు సంబంధాలు బయటికి వస్తున్నాయి. క్యాసినోకు వచ్చే కస్టమర్లను అలరించేందుకు సినీతారలను ఏర్పాటు చేసిన ప్రవీణ్ వాళ్లకు భారీగా నజరానా ఇచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ డబ్బులు ఇచ్చిన సెలబ్రెటీల చిట్టాను ఈడీ తయారు చేసింది. 

వాళ్లందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చీకోటి ప్రవీణ్ తో సాన్నిహిత్యం ఉన్న నేతల్లో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ఏపీకి చెందిన మాజీ మంత్రి.. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. వీళ్లంతా ప్రవీణ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో నేపాల్ వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారని సమాచారం. చీకోటి ప్రవీణ్ తో లింకులున్న బడా నేతల విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మంత్రితో అతనికి దగ్గరి సంబంధాలు ఉన్నాయంటున్నారు. 

సదరు మంత్రి కార్యక్రమాల్లో ప్రవీణ్ కనిపించేవారని తెలుస్తోంది. ఆ మంత్రి అండతోనే హైదరాబాద్ లో తన దందాను సాగించారని చెబుతున్నారు. ఏపీ నేతల విషయానికి వస్తే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రితో ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయంటున్నారు. సదరు నేత ఇలాఖాలోనే క్యాసినో నిర్వహించారని ప్రవీణ్ పై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ బడా నేతలు బ్లాక్ మనీని వైట్ మార్చుకునేందుకు కాసినో ద్వారా చీకోటి ప్రవీణ్ సహకరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత  వర్ల రామయ్య చెప్పారు.

చీకోటి ప్రవీణ్‌ చీకటి దందాతో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనికి లింకులు ఉన్నాయని ఆరోపించారు. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపితే అందరి బండారం బయటపడిందని వర్ల రామయ్య తెలిపారు. జూన్‌ 10,11,12,13 తేదీల్లో ప్రత్యేక విమానంలో నేపాల్‌ వెళ్లిన వారి జాబితాను బయటపెడితే ఏపీ  ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు వర్ల రామయ్య. ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం నుంచి పేకాటరాయుళ్లను  శంషాబాద్‌ రప్పింది... ప్రత్యేక ఫ్లైట్ లో ప్రవీణ్ నేపాల్ తీసుకువెళ్లాడని వెల్లడించారు. 

విమాన ఛార్జీలు, బస, లంచ్ తో తారల డ్యాన్సులు చూడటానికి ఒక్కొక్కరి వద్ద మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడని తెలిపారు. క్యాసినో కోసం నేపాల్ వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలే ఉన్నారన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ స్నేహితులు ప్రవీణ్ కు సహకరించారని వర్ల రామయ్య ఆరోపించారు.సంక్రాంతికి  గుడివాడలో  క్యాసినో  నిర్వహించి కోట్లాది రూపాయలను కొడాలి నాని స్వాహా చేశారని వర్ల రామయ్య చెప్పారు. కేవలం ఎంట్రీ టికెట్‌ ద్వారానే 180 కోట్లు చేతులు మారాయన్నారు.ఎమ్మెల్యే వంశీకి ఇందులో వాటా ఉందన్నారు.

ఈ డబ్బును చీకోటి ప్రవీణ్‌ బృందం నేపాల్ లో కరెన్సీగా మార్చి మనీ లాండరింగ్‌ చేసిందని వర్ల ఆరోపించారు. ఈ డబ్బును లావోస్‌లోని బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని... అక్కడి నుంచి కరెన్సీ ఏపీకి ఇబ్బడిముబ్బడిగా రావడంతో ఆర్‌బీఐ ఉలిక్కిపడిందని రామయ్య తెలిపారు. చీకోటి ప్రవీణ్ ను విచారిస్తే అక్రమ బాగోతం మొత్తం బయటికి వస్తుందని వర్ల రామయ్య తెలిపారు.

Also read:Musi River: మూసీ నదికి తగ్గిన వరద ప్రవాహం..ఊపిరి పీల్చుకున్న నగరవాసులు..!

Also read:Ashwini Dutt:నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన అశ్వినీదత్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News