Flash Floods: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు పెను గండం ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలకు ఊహించని వరద వస్తోంది. అటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పటికే డేంజర్ లెవల్ దాటిపోయింది. నగర పరిధిలోని చెరువులన్ని నిండిపోవడంతో వరద కాలనీలను ముంచేస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. నగరంలో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. దీంతో మళ్లీ వర్షం వస్తే పరిస్ఠితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే భారీగా ఉన్న వరదతో హైదరాబాదీలు వణికిపోతుండగా.. ఇప్పుడు జంట జలాశయాలు వాళ్లను మరింత వణికిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడు లేనంతగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద పోటెత్తింది. సాయంత్రం 6 గంటల సమయానికి ఉస్మాన్ సాగర్ కు 4 వేల 8 వందల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యాం ఎనిమది గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 4 వేల 900 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. అటు హిమయాత్ సాగర్ కు భారీగా వరద వస్తోంది. హిమాయత్ సాగర్ కు 3 వేల 5 వందల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 3 వేల 8 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జంట జలాశయాల నుంచి 8 వేలకు పైగా క్యూసెక్కుల వరద మూసీలో ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలతో మూసీ ఇప్పటికే ఉప్పొంగుతోంది.
గండిపేటతో పాటు మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలకు వరద మరింతగా పెరగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు మూసీ పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీకి వరద మరింత పెరిగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయోమన్న ఆందోళనలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా రెస్క్యూ టీమ్ లను అందుబాటులో ఉంచారు.
Read also: KTR: కాలుకు గాయమైందని కేటీఆర్ డ్రామా చేస్తున్నారా? అసలు కారణం ఇదేనా?
Read also: CM JAGAN:సీఎం జగన్ పెన్ను తీసుకున్న చిన్నారి... ఆ పెన్ను ఖరీదు 70 వేలకు ఎక్కువే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి