తరాలకు సరిపడా సంపాదించుకున్నాం.. రుణం తీర్చుకోకపోతే ఎలా.. సొంత పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్

MLA KR Ramesh Kumar Comments : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ సొంత పార్టీనే ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గాంధీల పేరుతో తరాలకు సరిపడా సంపాదించుకున్నామని వ్యాఖ్యానించారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 22, 2022, 01:40 PM IST
  • తరాలకు సరిపడా సంపాదించుకున్నాం..
  • పార్టీ రుణం తీర్చుకోకపోతే ఎలా..
  • కాంగ్రెస్ పార్టీ నిరసన సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలు
  • సొంత పార్టీనే ఇరుకునపెట్టేలా చేసిన ఎమ్మెల్యే
తరాలకు సరిపడా సంపాదించుకున్నాం.. రుణం తీర్చుకోకపోతే ఎలా.. సొంత పార్టీని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్

MLA KR Ramesh Kumar Comments : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా రమేష్ కుమార్ సొంత పార్టీ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీల పేరుతో మూడు, నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రమేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేర్లుతో మూడు, నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకున్నాం. అందుకు ప్రతిగా పార్టీ రుణం తీర్చుకోకపోతే మనం తినే తిండిలో పురుగులు పడుతాయని నేను భయపడుతుంటాను.' అంటూ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని 'స్కామ్ గ్రెస్' పార్టీ అంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. అలాంటిది ప్రత్యర్థులకు మరింత అవకాశమిచ్చేలా రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

కేఆర్ రమేష్ కుమార్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లైంగిక దాడి అనివార్యమైనప్పుడు అత్యాచారాన్ని ఎంజాయ్ చేయాలని గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలకు  చింతిస్తూ క్షమాపణలు తెలియజేశారు. ఆయన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేలా ఉన్నాయి. 

Also Read: Komatireddy:కోమటిరెడ్డితో బీజేపీ కొత్త గేమ్.. పక్కా ప్లాన్ తో రంగంలోకి అమిత్ షా! కేసీఆర్, రేవంత్ రెడ్డికి తీన్మారేనా? 

Also Read: CBSE 12th results 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News