AB Venkateswara Rao : రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నా.. అందుకే నాపై కక్ష! సీఎం జగన్ పై సీనియర్ ఐపీఎస్ హాట్ కామెంట్స్..

AB Venkateswara Rao : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను మరోసారి సస్పెండ్ చేసినా తగ్గేదే లే అంటున్నారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆయన ఆరోపణలు చేశారు. సస్పెండ్ అయినట్లు తనకు ఇంకా జీవో కాపీ రాలేదన్నారు. మీడియా వార్తలతోనే తనకు తెలిసిందన్నారు.

Written by - Srisailam | Last Updated : Jun 29, 2022, 03:05 PM IST
  • ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెండ్
  • ఏపీ ప్రభుత్వంపై ఏబీ తీవ్ర వ్యాఖ్యలు
  • రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నా- ఏబీ
AB Venkateswara Rao : రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నా.. అందుకే నాపై కక్ష! సీఎం జగన్ పై సీనియర్ ఐపీఎస్ హాట్ కామెంట్స్..

AB Venkateswara Rao : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను మరోసారి సస్పెండ్ చేసినా తగ్గేదే లే అంటున్నారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆయన ఆరోపణలు చేశారు. సస్పెండ్ అయినట్లు తనకు ఇంకా జీవో కాపీ రాలేదన్నారు. మీడియా వార్తలతోనే తనకు తెలిసిందన్నారు. తనపై ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమే అయినా ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదని చెప్పారు. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ప్రశ్నించారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో, పనికిమాలిన సలహాదారు ఇచ్చారో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి హైకోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు.

12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో జగన్ కు చార్జిషీట్ లు ఉన్నాయన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. శ్రీలక్ష్మి పైనా చార్జిషీట్ లు ఉన్నాయన్నారు. శ్రీలక్ష్మికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని అడిగారు. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పని తాను నిరూపిస్తానని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు ఏబీ. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని చెప్పారు.కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే గంటల్లోనే అడ్డుకున్నానని చెప్పారు. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు కామెంట్ చేశానా అని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నానంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసేకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని కామెంట్ చేశారు.

 

1989 ఏపీ కేడర్ కు చెందిన ఏబీ వెంకటేశ్వరరావు గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.ఆ సమయంలో ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారు. నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ  నిబంధనలు ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయన మీద కేసు పెట్టింది. తర్వాత 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. కానీ గడువు ముగిసినా తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, జీతభత్యాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి జూన్ 15  పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావును  ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమించింది. విధుల్లోకి తీసుకున్న రెండు వారాలకే మరోసారి సస్పెండ్ చేసింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు, గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం  సస్పెండ్ చేసినట్లు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వుల్లో తెలిపారు.

Read also: Anti Modi Flexi: హైదరాబాద్ లో కలకలం.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

Read also:  Etela Rajender: ఈటల రాజేందర్ కు దిమ్మతిరిగే షాక్.. జమునా హెచరీస్ భూములు దళితులకు పంపిణి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News