PM Kisan Nidhi Samman Yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్దిదారులకు షాక్. పీఎం కిసాన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలకమార్పు చేసింది. ఫలితంగా రైతులకున్న వెసులుబాటు దూరమైంది. ఆ వివరాలేంటో చూద్దాం..
పీఎం కిసాన్ యోజనలో భాగంగా..రైతుల ఖాతాల్లో కొత్త ఏడాది ప్రారంభంలో 11వ విడత 2 వేల రూపాయలు బదిలీ అయ్యాయి. ఇప్పుడు ఆ పధకంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పు చేసింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా 12 కోట్ల కంటే ఎక్కువ రిజిస్టర్డ్ రైతులపై పడనుంది. వాస్తవానికి రైతులకున్న సౌకర్యం చేజారింది. ప్రభుత్వం చేసిన ఆ మార్పులేంటో చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనలో మార్పు చేసింది. ఇప్పుడిక ఏ రైతు కూడా పోర్టల్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్‌తో తన స్టేటస్ చూసుకోలేడు. స్టేటస్ చూసుకోవలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సిందే. ఇప్పటివరకూ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సహాయంతో స్టేటస్ చెక్ చేసుకునేవారు. ఆ తరువాత కేవలం ఆధార్ నెంబర్‌తోనే స్టేటస్ చెక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కేవలం మొబైల్ నెంబర్‌తోనే స్టేటస్ చెక్ చేయాల్సి వస్తుంది.
ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత అక్కడ కన్పించే Beneficiary Status క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే...Know Your Registration Numberపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పీఎం కిసాన్ ఎక్కౌంట్‌లో ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి..ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓటీపీ నమోదు చేసి..గెట్ డీటైల్స్ క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ ముందు ఉంటుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ప్రతియేటా రైతు కుటుంబాలకు 6 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసే పధకం. మూడు వాయిదాల్లో 2 వేల చొప్పున జమ చేస్తారు. ఇప్పటికే 11వ విడత రైతు ఖాతాల్లో జమ అయింది. మీ ఖాతాలో జమ అయిందో లేదో స్టేటస్ చెక్ ద్వారా తెలుసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.