కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు ఈ క్రీడల్లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం లభించినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం గమనార్హం. తాజాగా గుంటూరు జిల్లాకి చెందిన వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో 84 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 151 కేజీలు ఎత్తడంతో పాటు, క్లీన్ అండ్ జర్క్‌లో 187 కేజీలు ఎత్తి.. ఫైనల్‌గా 338 కేజీల రికార్డు నమోదు చేసి ఈ ఘనతను ఆయన సాధించాడు. 2014 సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో కూడా రాహుల్ వెయిట్ లిఫ్టింగ్ లో రజతం గెలుచుకున్నాడు
కాగా.. 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత గురురాజ్‌కే దక్కింది. గురువారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో మహిళ విభాగంలో మీరాబాయి చాను(48 కేజీల పోటీ) స్వర్ణాన్ని గెలుపొందగా, పురుషుల విభాగంలో పి గురురాజ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. శుక్రవారం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళల విభాగంలో సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో వెయిట్ లిఫ్టర్ దీపక్ లాతర్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. అలాగే తమిళనాడు వెల్లూరుకు చెందిన సతీష్ 77 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే
Woohooooo #ragalavenkatarahul 🥇🥇🥇🇮🇳🇮🇳🇮🇳💪💪💪 that last lift from the Samoan phoooo so close !! #superentertaining #fullofdrama yesss !! #comeonindia #CWG2018 #GC2018Weightlifting #gold #IndiaAtCWG
— Parupalli Kashyap (@parupallik) April 7, 2018
ఈ కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన తొలి తెలుగు బిడ్డ..!