Revanth Reddy Fire On Kcr: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఉస్మానియా యూనివర్శిటిలో రాహుల్ ఇంటరాక్షన్ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓయూలో నిరసనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను కలిసేందుకు వెళుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జగ్గారెడ్డి అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగ్గారెడ్డి ని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని రేవంత్ రెడ్డి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడన్న రేవంత్.. ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని చెప్పారు. ఓయూకి రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారంటే కేసీఆర్ ఎంతగా భయపడుతున్నారో అర్ధం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలను కేసీఆర్ బానిసలుగా అభివర్ణించిన టీపీసీసీ చీఫ్.. వాళ్ల మాటలపై తాను స్పందించబోనని చెప్పారు. ఇష్టమెచ్చినట్లుగా వ్యవహరిస్తున్న గులాబీ నేతలను.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు చెప్పులతో కొట్టాలన్నారు రేవంత్ రెడ్డి.అరెస్ట్ చేసిన అందరిని వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మే6న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా మే7న ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ కు పీసీసీ నేతలు ప్లాన్ చేశారు. అయితే ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించారు వీసీ. యూనివర్శిటీలో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని ప్రకటించారు. ఉస్మానియా వీసీ తీరుకు నిరసనగా ఎన్ఎస్ యూఐ నేతలు క్యాంపస్ లో ఆందోళన చేస్తున్నారు.ఓయూలో నిరసనకు దిగన నేతలను పరామర్శించేందుకు బయలుదేరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీంతో అతన్ని మధ్యలోనే అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఉస్మానియా యూనివర్శిటీలోకి ఎవరికి అనుమతి లేదని చెప్పారు. పోలీసుల తీరుపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Teenmar mallanna: బీజేపీ ఆఫీస్‌లో అడుగుపెట్టేది లేదు..కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..?
Also Read: Ketika Sharma Post: నేను సెక్సీగా ఉన్నానా లేదా.. యువ హీరోయిన్ అలా అడిగేసిందేందబ్బా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook