Todays Horoscope: ఏప్రిల్ 12, 2022న మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి

Todays Horoscope: ప్రతి రోజూ రాశులు, నక్షత్రాల కదలికల్ని బట్టి రాశి ఫలాలు మారుతుంటాయి. అందుకే చాలామంది ప్రతిరోజూ జాతకం ఎలా ఉందో తెలుసుకుంటుంటారు. ఆ రాశివారికి అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది..

Last Updated : Apr 12, 2022, 07:34 AM IST
 Todays Horoscope: ఏప్రిల్ 12, 2022న మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి

Todays Horoscope: ప్రతి రోజూ రాశులు, నక్షత్రాల కదలికల్ని బట్టి రాశి ఫలాలు మారుతుంటాయి. అందుకే చాలామంది ప్రతిరోజూ జాతకం ఎలా ఉందో తెలుసుకుంటుంటారు. ఆ రాశివారికి అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది..

ప్రతిరోజూ రాశిఫలాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి. కొంతమంది రాశి ఫలాలు తెలుసుకోకుండా ఏ పనీ ప్రారంభించరు కూడా. ఆ రోజు తమకెలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఇవాళ్టి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం-వృషభం

మేషరాశివారికి ఇవాళ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్తవారితో సమస్యలు రాకుండా చూసుకోవడం మంచిది. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. అదే సమయంలో వ్యాపారమైతే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వృషభరాశి వారికి పూర్తిగా అనుకూలమే. ఆర్ధికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారికి మంచి జరుగుతుందట. శుభకార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా మనసు ఆనందం కలుగుతుంది. 

మిథునం-కర్కాటకం

మిథునరాశి వారికి పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. అయితే కొందరిని ఎక్కువగా నమ్మకూడదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శారీరక సౌఖ్యం ప్రాప్తిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. ఇక కర్కాటక రాశివారైతే మనోబలం పెంచుకోవాలి. కొత్త వస్తువుల్ని కొంటారు. చేపట్టాల్సిన పనులకు దైవ సహాయం ఉంటుంది.

సింహం-కన్య

సింహరాశివారికి పరిస్థితి అనుకూలమే. వ్యాపారపరంగా లేదా ఉద్యోగపరంగా బాగుంటుంది. అందరితోనూ ఆనందంగా ఉంటారు. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. కీలకమైన నిర్ణయాలు విజయవంతమౌతాయి. ఇక కన్యారాశి వారికి ఓ శుభవార్త విన్పిస్తుంది. మీరు అనుకున్న ముఖ్యమైన విషయానికి సంబంధించి ప్రోగ్రెస్ కన్పిస్తుంది. 

తుల-వృశ్చికం

తులరాశి వారికి ప్రతిభకు తగిన ప్రశంస, ప్రోత్సాహం లభిస్తుంది. మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనిలో ఎదురయ్యే ఇబ్బందుల్ని సులభంగానే అధిగమిస్తారు. ఇక వృశ్చిక రాశివారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉద్యోగస్థులకు అప్రమత్తం అవసరం. ప్రత్యర్ధుల్నించి ముప్పు ఎదురుకావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం.

ధనస్సు-మకరం

ధనస్సు రాశివారికి ఇవాళ పూర్తిగా సానుకూల ఫలితాలుంటాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. తెలివితేటలు ప్రదర్శించాల్సి ఉంటుంది. కావల్సినవారితో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక మకర రాశివారు కూడా గుడ్‌న్యూస్ వింటారు. మీరు చేసే పనికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్ధిక విషయాల్లో మాత్రం జాగ్ర్తత్తగా ఉండాలి. 

కుంభం-మీనం

కుంభరాశివారికి సానుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలం ఫలితాలుంటాయి. అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీనరాశివారికి ఓ వార్త ఆనందం కల్గిస్తుంది. అవసరానికి ధనం చేతికి అంది..కష్టాలు గట్టెక్కుతాయి. మీ పనిని ఇతరులు మెచ్చుకుంటారు. 

Also read: Solar Eclipse April 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x