Pan aadhaar: కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చింది. దీనితో ఆర్థికపరంగా అనేక మార్పులు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. అముదలో ముఖ్యమైంది.. పాన్-ఆధార్ పాన్ లింక్. మార్చి 31తో పాన్ ఆధార్ అనుసంధానానికి గడువు ముగిసింది. అయినప్పటికీ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).. పాన్-ఆధార్ అనుసంధానం ఇంకా చేసుకోని వారికి కాస్త ఊరటనిచ్చింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగిసిన నేపథ్యంలో తాజాగా సీబీడీటీ ఓ ప్రకటన చేసిందగి. దీని ప్రకారం.. పాన్-ఆధార్ అనుసంధానానం చేయకున్నా మరో సంవత్సరం పాటు అవి యాక్టివ్‌లోనే ఉంటాయని స్పష్టం చేసింది. అంటే మార్చి 31 వరకు పాన్ కార్డులు (ఆధార్‌తో లింక్ కానివి) వినియోగించే వీలుంది. వాటితో ఐటీఆర్ ఫైల్ చేయడం, రీఫండ్స్ క్లెయిమ్ సహా ఇతర ఆర్థిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఒక్కసారిగా పాన్ కార్డులు నిరుపయోగంగా మారితే.. ఇబ్బందులు రావచ్చనే ఉద్దేశంతో సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇక పాన్-ఆధార్ లింక్‌కు జరిమానా..
ఇకపై పాన్-ఆధార్ లింక్ చేయాలంటే రూ.500 చెల్లించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. అది కూడా జూన్ 30 వరకేనని తెలిపింది. జులై నుంచి ఈ ఫైన్ రూ.1,000కి పెరుగుతుందని వెల్లడించింది. ఈ గడువు కూడా ముగిసిన తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారనున్నాయి.
పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా మారితే ఏమవుతుంది?
పాన్ కార్డు నిరుపయోగంగా మారితే.. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ల వంటి వాటిలో పెట్టుబడులు పెట్టలేరు. అధిక టీడీఎస్, ఐటీ చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం.. జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Also read: ATF Price hike: కొత్త రికార్డు స్థాయికి ఏటీఎఫ్ ధర- పెరగనున్న విమాన టికెట్ల ధరలు?
Also read: LPG Gas Price Hike: భారీగా పెరిగిన LPG గ్యాస్ ధర.. సిలిండర్ పై రూ.250 పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook