Asaduddin Owaisi Z security: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భద్రతపై పార్లమెంట్లో ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఒవైసీకి ఇంకా ముప్పు ఉన్నట్లు తమ విచారణలో తేలినట్లు వెల్లడిచారు. ఈ కారణంగా ఆయన.. ప్రభుత్వ ఇటీవల కేటాయించిన Z క్యాటగిరీ సెక్యూరిటీని అంగీకరించాలని కోరారు.
రాజ్య సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన అమిత్ షా. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 3న ఒవైసీ కారుపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలతో ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఆయన కారుపై మాత్రమే మూడు బుల్లెట్ గుర్తులు పడ్డట్లు వివరించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.
అసలు ఏమైందంటే..
యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అభ్యర్థి తరఫున మీరఠ్‌లో ప్రచారం కోసం వెళ్లారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న ఆయన కారుపై హాపూర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటనతో ఒక్క సారిగా హోం శాఖ అప్రమత్తమైంది. ఒవైసీకి భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. మరునాడే ఆయనకు Z సెక్యూరిటీ భద్రతను ఇస్తున్నట్లు ప్రకటించింది.
అయితే కేంద్రం ప్రకటించిన Z సెక్యూరిటీని అసదుద్దీన్ ఒవైసీ తిరస్కరించారు. తాను సామాన్యులతోనే ఉంటానని.. వాళ్లు సేఫ్‌గా ఉన్నప్పుడే తాను సురక్షితమన్నారు.
ఈ పరిణామాల నేఫథ్యంలో ఒవైసీకి ఇంకా ముప్పు పొంచి ఉందని.. అందుకే భద్రత పెంపునకు అంగీకరించాలని కోరుతూ హోం మంత్రి అమిత్ షా రాజ్య సభలో కోరారు.
Also read: Rahul Gandhi Security Lapse: పంజాబ్‌లో మరోసారి భద్రతా లోపం- ఈ సారి రాహుల్ గాంధీకి..
Also read: Tribute To Lata Mangeshkar: దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు రాజ్యసభ నివాళి.. గంట పాటు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook