Best Recharge Plans: మీరు జియో, ఎయిర్‌టెల్, వీఐ కస్టమర్లా.. అయితే ఈ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..

Jio Airtel and Vi Recharge Plans:  జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్స్‌లో 56 రోజుల వాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్‌తో కూడిన బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 06:44 PM IST
  • జియో, ఎయిర్‌టెల్, వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
  • డేటా, అపరిమిత కాల్స్‌, 56 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్స్
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Best Recharge Plans: మీరు జియో, ఎయిర్‌టెల్, వీఐ కస్టమర్లా.. అయితే ఈ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..

Jio Airtel and Vi Best Recharge Plans: ఓ పదేళ్ల క్రితం ఫోన్ వాడకం అంటే కేవలం వాయిస్ కాల్స్‌, టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి ఇంటర్నెట్ విస్తృతి పెరిగాక సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఫోన్ వాడకమంటే కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే కాదు. వీడియో కాల్స్, ఓటీటీ స్ట్రీమింగ్, సోషల్ ప్లాట్‌ఫామ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఫోన్ వాడకమంటే డేటా వినియోగం తప్పనిసరి అయిపోయింది. కస్టమర్లు ఎప్పటికప్పుడు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ టెలికాం నెట్‌వర్క్స్ 56 రోజుల వాలిడిటీతో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి..

వొడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్ ప్లాన్స్ :

Vi రూ. 539 ప్లాన్ : రూ. 539 ప్లాన్‌తో 56 రోజుల పాటు ప్రతి రోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అంతేకాదు, డేటా  రోల్‌ఓవర్ బెనిఫిట్స్ పొందవచ్చు. అంటే, మీరు ఉపయోగించని డేటాను వీకెండ్‌లో ఉపయోగించుకోవచ్చు. అలాగే నెలకు 2 జీబీ బ్యాకప్ డేటాతో పాటు Vi Movies, TV యాప్‌కి యాక్సెస్‌ని పొందుతారు.

Vi రూ. 699 ప్లాన్:  వొడాఫోన్ ఐడియా అందించే ఈ 56 రోజుల వాలిడిటీ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 3 జీబీ ఇంటర్నెట్ పొందుతారు. వీకెండ్‌లో డేటా రోల్‌ఓవర్ బెనిఫిట్ పొందుతారు. నెలకు 2GB బ్యాకప్ డేటా, Vi Movies, TV యాప్‌కి యాక్సెస్ పొందుతారు.

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ : 

ఎయిర్‌టెల్ రూ. 479 ప్లాన్: ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్‌కు 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఏ నెట్‌వర్క్‌తోనైనా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్, షా అకాడమీకి ఒక నెల పాటు యాక్సెస్ ఉంటుంది. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌కు యాక్సెస్‌తో పాటు ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ. 549 ప్లాన్: ఈ ప్లాన్‌తో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్, ప్రతి రోజూ 2 జీబీ ఇంటర్నెట్ డేటా పొందుతారు. నెల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో  మొబైల్ వెర్షన్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ యాక్సెస్ పొందుతారు. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌కు యాక్సెస్‌తో పాటు ఫాస్ట్ ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందుతారు.

జియో రీఛార్జ్ ప్లాన్స్ :

జియో రూ. 479 ప్లాన్: ఈ ప్లాన్‌తో 56 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ మెంబర్‌షిప్ పొందుతారు.

జియో రూ. 533 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 2 జీబీ ఇంటర్నెట్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ, జియో యాప్‌ సభ్యత్వాన్ని పొందుతారు.

ఇవి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో 56 రోజుల వాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Recharge Plans). ఇందులో మీకు నచ్చిన ప్లాన్స్‌ను ఎంచుకోండి.

Also Read: Allu Arjun Zomato: మనసు కోరితే తగ్గేదే లే.. జొమోటో ఓపెన్ చేయడమే! అరె బన్నీ కూడా ఏసేశాడుగా!!

Also Read: Budget 2022: కేంద్రం ఆ ప్రకటన చేస్తే- పీపీఎఫ్​ ద్వారా రూ.80 లక్షల ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News