AP Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా పెరిగాయి. కొత్తగా 839 మందికి కొవిడ్ పాజిటివ్ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 37,553 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది.
ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా శ్రీకాకులంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,503 మంది కొవిడ్‌కు బలయ్యారు.
#COVIDUpdates: As on 08th January, 2022 10:00AM
COVID Positives: 20,77,707
Discharged: 20,59,545
Deceased: 14,503
Active Cases: 3,659#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kZnIOc1iIM— ArogyaAndhra (@ArogyaAndhra) January 8, 2022
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,62,440 మంది కరోనాను జయించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,659 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.
విశాఖపట్నంలో 771, చిత్తురులో 659 చొప్పున అత్యధికంగా యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం.
ఇక ఇప్పటి వరకు మొత్తం 3,15,67,472 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 20,80,602 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలినట్లు వివరించింది.
మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.
Also read:Ap Government: ఏపీలో నైట్ కర్ఫ్యూపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
Also read: Family suicide in Vijayawada: విజయవాడలో దారుణం- తెలంగాణ కుటుంబం ఆత్మ హత్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook