Mohan babu: 'సినీ పరిశ్రమలో అందరూ సమానమే.. కలిసి సినిమాని బతికిద్దాం'

Mohan babu: సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మోహన్​ బాబు ఎట్టకేలకు మౌనం వీడారు. ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ లేఖలో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 08:36 PM IST
  • 'సినీ పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒక్కరు తక్కువ కాదు'
  • 'చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆండాలి'
  • 'సినీ రంగం సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి రావాలి'
  • సినిమా రంగం సమస్యలపై మోహన్​ బాబు బహిరంగ లేఖ
Mohan babu: 'సినీ పరిశ్రమలో అందరూ సమానమే.. కలిసి సినిమాని బతికిద్దాం'

Mohan babu: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు సీనియర్ నటుడు మోహన్​ బాబు. కలిసి సినిమాను బతికిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా సుదీర్ఘ బహిరంగ (Mohan babu open latter to Tollywood) లేఖ రాశారు.

మోహన్​ బాబు ఏమన్నారంటే..

తాను ఈ విషయంపై స్పందించే విషయంపై తనకు సన్నిహితులు వారించారని అయితే వాళ్లు చెప్పినట్లు వినాలా? నాలా బతకాలా అనే విషయానికి సమాధానంగానే లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు మోహన్​ బాబు.

'సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్​, నలుగు  డిస్ట్రిబ్యూటర్స్​ కాదు.. (Mohan babu on Cinema Industry) కొన్ని వేలమంది ఆశలు, కొన్నివేల కుటుంబాలు.. కొన్ని వేల జీవితాలు..

47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట.. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒక్కచోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుంది. అని చర్చించుకోవాలి.' లేఖలో పేర్కొన్నారు మోహన్​ బాబు.

అలా వెళ్లడం ఏమిటి?

సమస్యల గురించి తమలో తాము చర్చించుకున్న తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫి మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా (Mohan babu on Cinema industry problems)కలవాలన్నారు.

అలా కాకుండా, నలుగుర్నే రమ్మన్నారు, ప్రొడ్యూసర్స్​ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని.. అందరూ సమానమేనని ఆయన ఉద్ఘాటించారు. చిన్న నిర్మాతలను కూడా కలుపుకుని ముఖ్యమంత్రులను కలిసి ఉంటే.. ఈ రోజు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు మోహన్​ బాబు.

అప్పుడలా చేశాం..

మోహన్ బాబు 'మా' అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిశ్రమలోని ప్రముఖులందరితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్​ రెడ్డిని కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. పైరసీ కోరల్లో సినిమా నలిగి పోకుండా తమపై దయ చూపాలని ఆయన్ను కోరినట్లు తెలిపారు. ఆయితే ఈ మాటలు అప్పట్లో చాలా మందికి నచ్చకపోయినా.. ఆయన్ను (ముఖ్యమంత్రిని) కదిలించాయని పేర్కొన్నారు.

ఇంకా ఏమన్నారంటే..

రూ.350, రూ.300 టికెట్లతో చిన్న సినిమాలు నిలబడటం కష్టమని.. అదే విధంగా రూ.50, రూ.30 టికెట్లతో పెద్ద సినిమాలు నిబడటం కూడా కష్టమేనని మోహన్​ బాబు (Mohan babu on Ticket Price Issue) పేర్కొన్నారు.

చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అయ్యా మా సినీ రంగం పరిస్థితి ఇది.. అని వివరించి న్యాయం చేయమని కోరుదామన్నారు.

నిర్మాతలు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రొడ్యూసర్లంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Also read: Actor crying: తన ఫేవరైట్ హీరోను చూసి బోరున ఏడ్చిన మరో స్టార్ హీరో

Also read: Urfi Javed Lipstick Pics: బోల్ట్‌నెస్‌లోనే కాదు లిప్‌స్టిక్ స్టైల్స్‌లో ఉర్ఫీ జావేద్ సూపర్‌హాట్ ఫోటోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News