Smart Watch Disadvantages: స్మార్ట్ వాచ్ లు శరీరానికి మేలు కంటే హానీ ఎక్కువని మీకు తెలుసా?

Smart Watch Disadvantages: ఆధునిక కాలంలో ట్రెండ్ కు తగ్గట్లు యువత ప్రవర్తిస్తున్నారు. ఫ్యాషన్ నుంచి గ్యాడ్జెట్స్ వరకు ట్రెండ్ కు తగ్గట్లు నడుచుకుంటున్నారు. ఇటీవలీ కాలంలో యువతను స్మార్ట్ వాచ్ లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ద్వారా శరీర పనితనాన్ని తెలుసుకునేందుకు వీలువుతుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ లను ధరించడం వల్ల శరీరానికి కలిగే మేలు కంటే హానీ కలుగుతుందని తెలుసా?   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 05:57 PM IST
Smart Watch Disadvantages: స్మార్ట్ వాచ్ లు శరీరానికి మేలు కంటే హానీ ఎక్కువని మీకు తెలుసా?

Smart Watch Disadvantages: మోడరన్ యుగంలో చాలామంది గ్యాడ్జెట్ ప్రియులు స్మార్ట్ ఫోన్స్ తో పాటు స్మార్ట్ వాచ్ లను ఎంతో ఇష్టంగా ధరిస్తారు. ఈ స్మార్ట్ వాచ్ ల ద్వారా టైమ్ తెలుసుకోవడం సహా గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు, వ్యాయామాలతో పాటు అనేక సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి.  చేతి మణికట్టుకు పెట్టుకునే ఈ స్మార్ట్ వాచ్ లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? 

మన ప్రతి అడుగును ట్రాక్ చేసే ఈ స్మార్ట్ వాచ్ లు మనల్ని అనారోగ్యానికి దారితీస్తాయని మీకు తెలుసా? ఫిట్‌నెస్‌ను లెక్కించడానికి మీరు రోజంతా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించవచ్చు. ప్రతి విభాగంలో మీరు టార్గెట్ చేరుకున్నట్లు భావం మీకు రావొచ్చు. కానీ, ఈ స్మార్ట్ వాచ్ ల వల్ల మీలో ఒత్తిడి పెరుగుతుంది. అయితే గ్యాడ్జెట్ లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగల ఏకైక మార్గం ఏంటో తెలుసా?

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?

ఏ ఫిట్‌నెస్ గాడ్జెట్‌లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచలేవని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు, కానీ మీరు మీ ఆరోగ్యం గురించి నిర్ణయాలు తీసుకునేలా ఈ గాడ్జెట్‌లను అనుమతిస్తే, మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండలేరు.

మనం అర్థం చేసుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే.. 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ ఇలాంటి గాడ్జెట్‌లను ఉపయోగించకూడదు.

మీరు వ్యాయామం చేసేటప్పుడు మాత్రమే ఈ స్మార్ట్ వాచీలు లేదా బ్యాండ్లను ధరించవచ్చు.

కూల్‌గా లేదా ఫ్యాషన్ వేరియబుల్ కనిపించడానికి ఈ స్మార్ట్ వాచీలను ధరించవద్దు

ఈ గాడ్జెట్‌లతో రోజులో ఎంత వర్కవుట్ చేయాలి, ఎన్ని కిలోమీటర్లు పరుగెత్తాలి అనే స్మార్ట్ వాచ్ లో విషయాన్ని నిర్ణయించే బదులు వైద్యుడిని సంప్రదించండి.

ఈ 4 కారకాలతో ఆరోగ్యం

మీరు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటే మీరు మరింత సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం చెడిపోతే మీరు సంతోషంగా ఉంటారు. వీటి ఆధారంగా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. 

పోషకాలున్న ఆహారాన్నితీసుకోవడం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం, శరీరానికి విశ్రాంతినివ్వడం వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు.  

Also Read: Hangover Remedies: 31 నైట్ హ్యాంగోవర్ ఆ?.. ఇలా చేస్తే హ్యాంగోవర్ చిటికెలో మాయం!

Also Read: Men Sexual Health: పురుషుల లైంగిక సామర్థ్యానికి మేలు చేసే ఆహారం.. ఇవి తింటే ఇక చెడుగుడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News