COVID 19 Vaccine: కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కిన 40 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!!

Man climbs on tree to avoid dose of Coronavirus vaccine: పుదుచ్చేరిలోని విలియనూర్ సమీపంలోని కోనేరికుప్పం గ్రామంలోని ముత్తువేలు కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 01:46 PM IST
  • కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కాడు
  • ఆరోగ్య కార్యకర్తలు సర్ధిచెప్పినా వినని వ్యక్తి
  • ముత్తువేలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
COVID 19 Vaccine: కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కిన 40 ఏళ్ల వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!!

Man Climbs on Tree to Avoid Dose of Coronavirus Vaccine in Puducherry: గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారికి ఇప్పటికే ఎందరో బలయ్యారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, కరోనా టీకా వేసుకోవడం ద్వారా వైరస్ బారినుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కరోనా రెండు డోసుల టీకా వేసుకున్న వారిపై మహమ్మారి ప్రభావం పెద్దగా కనబడడం లేదు. అందుకే ప్రతిఒక్కరు టీకా (Coronavirus Vaccine) వేసుకుందుకు దగ్గరలోని ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. అయితే టీకా వేస్తామని ఇంటికి వచ్చినా.. ఓ 40 ఏళ్ల వ్యక్తి మాత్రం ససేమిరా అన్నాడు. అంతేకాదు చెట్టు ఎక్కి అందరిని ఇబందిపెట్టాడు. వివరాల్లోకి వెళితే... 

పుదుచ్చేరి (Puducherry)లోని విలియనూర్ సమీపంలోని కోనేరికుప్పం గ్రామంలో కొందరు ఇప్పటికి కూడా కరోనా మొదటి డోస్ వేసుకోలేదు. దాంతో మంగళవారం అక్కడి వైద్య సిబ్బంది కరోనా టీకాలు వేసేందుకు డోర్ టు డోర్ వాక్సినేషన్ చేపట్టారు. కోనేరికుప్పం గ్రామంలో ముత్తువేలు (Muttuvelu) అనే 40 ఏళ్ల వ్యక్తి ఇప్పటికి కూడా ఒక్క డోసు తీసుకోలేదు. అతనికి టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వెళ్లగా.. ఇది గమనించిన ముత్తువేలు పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టు ఎక్కాడు. తనకు చెట్లు నరికే పని వుందంటూ చెట్టు ఎక్కి అక్కడే ఉండిపోయాడు. 

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. అరంగేట్రం చేసిన తర్వాత ఇది రెండోసారి!!

కరోనా టీకా వేస్తామని ఆరోగ్య కార్యకర్తలు ఎంత బ్రతిమిలాడినా ముత్తువేలు చెట్టు (Tree)పై నుంచి కిందకు దిగలేదు. అవసరమైతే మీరే చెట్టెక్కి నాకు టీకా వేయండి అని సెటైర్లు పేల్చాడు. గ్రామానికి చెందిన చాలా మందికి కూడా టీకాలు వేశామని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఏమీ జరగలేదని వారు హామీ ఇచ్చి అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కోవిడ్ -19 వ్యాధిని నివారించడానికి టీకాలు వేసుకోవడం అవసరమని కూడా వివరించారు. కానీ ముత్తువేలు మాత్రం నిరాకరించాడు. ఎందుకు వేసుకోవని ఆరోగ్య కార్యకర్తలు అడగ్గా.. 'టీకా వేసుకుంటే మద్యం తాగొద్దు కదా' అని బదులిచ్చాడు. ఇది విన్న అక్కడివారు నవ్వులు పూయించారు. 

మద్యం కంటే ప్రాణం ముఖ్యమని ముత్తువేలుకి ఆరోగ్య కార్యకర్తలు సర్ధిచెప్పినా వినలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు (Health Workers) అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ముత్తువేలు పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక పుదుచ్చేరి ప్రభుత్వం 100 శాతం కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను సాధించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం ముత్తువేలు తప్పించుకున్నా.. త్వరలోనే అతడిని పట్టుకుని వాక్సిన్ వేస్తామని విలియనూర్ వైద్యబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. 

Also Read: Section 144 Imposed: రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు.. న్యూఇయర్ వేడుకలపై బ్యాన్ విధించిన ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News