Omicron Third Wave: కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్‌తో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ సృష్టిస్తున్న కలవరంతో ప్రపంచదేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. అటు ఇండియాలో ఇదే వేరియంట్..కరోనా థర్డ్‌వేవ్‌కు దారి తీయవచ్చనే హెచ్చరిక జారీ అవుతోంది.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం వెంటాడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ క్రమంగా దేశంలో వ్యాప్తి చెందుతోంది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకూ 358 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 114 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఇక రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, గుజరాత్లో 30, కేరళలో 27, రాజస్థాన్‌లో 22 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే...ఫిబ్రవరిలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పుు తలెత్తనుందని ఐఐటీ కాన్పూర్(IIT Kanpur)పరిశోధకులు వెల్లడించారు.
ఇప్పటికే ప్రపంచంలో యూకే, అమెరికా, ఇజ్రాయిల్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్(Omicron)సంక్రమణ ప్రమాదకరంగా మారింది. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్..ఫోర్త్వేవ్కు దారితీయనుందనే హెచ్చరికలున్నాయి. ఇటు ఇండియాలో కోవిడ్ థర్డ్‌వేవ్‌కు దారి తీసి..మూడోవారానికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ను అంచనా వేసేందుకు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు..గసియన్ మిశ్రమ్ గణిత పద్థతిని ఉపయోగించారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధికంగా ఉన్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాల నుంచి సేకరించిన సమాచారానికి ఇండియాలో ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ సమయంలో నమోదైన కేసుల సంఖ్యను మిళితం చేశారు. ఈ గణాంకాల ప్రకారం దేశంలో ఫిబ్రవరి నెలలో కరోనా థర్డ్‌వేవ్ గరిష్టవేగానికి చేరుకోవచ్చని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జనవరి నెల నుంచి దేశంలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) ప్రభావం కచ్చితంగా కన్పిస్తుందని..ఒమిక్రాన్ వేగం పెరుగుతుందని అంచనా వేశారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో వ్యాక్సినేష్ ప్రక్రియ పూర్తయినా..థర్డ్‌వేవ్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ కంటే తీవ్రత తక్కువగానే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also read; Bijnor Gangrape: కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి.. స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి