IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు ధీటుగా కివీస్‌! తేలిపోయిన భారత బౌలర్లు!!

ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, విల్‌ యంగ్‌ హాఫ్ సెంచరీలతో సత్తాచాటడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిల్యాండ్ 57 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ స్కోరుకు కివీస్ 216 పరుగులు వెనకబడి ఉంది.   

Last Updated : Nov 26, 2021, 06:43 PM IST
  • ముగిసిన రెండో రోజు ఆట
  • టీమిండియాకు ధీటుగా కివీస్‌
  • తేలిపోయిన భారత బౌలర్లు
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు ధీటుగా కివీస్‌! తేలిపోయిన భారత బౌలర్లు!!

New Zealand openers fightback after Shreyas Iyer's debut hundred in Kanpur: కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిల్యాండ్ ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (Tom Latham) (50 నాటౌట్‌; 165 బంతుల్లో 4 ఫోర్లు), విల్‌ యంగ్‌ (Will Young) (75 నాటౌట్‌; 180 బంతుల్లో 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటడంతో.. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిల్యాండ్ 57 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ స్కోరుకు కివీస్ 216 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు 258 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (Shreyas Iyer) (105) సెంచ‌రీ చేయ‌గా.. కివీస్ బౌల‌ర్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.

258/4 స్కోరుతో రెండో రోజైన శుక్రవారం ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 87 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన కాసేపటికే రవీంద్ర జడేజా (Jadeja) (50) ఔట్ అయ్యాడు. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు ఒక్క పరుగు కూడా చేయకుండానే అతడు పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (Saha) (1) విఫలమయ్యాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగానే ఆడిన శ్రేయస్‌ అయ్యర్ కెరీర్‌లో తొలి సెంచరీ బాదాడు. శ్రేయస్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం బాదేసిన 16వ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 

Also Read: B.1.1.529: కొత్త క‌రోనా వేరియంట్‌పై వ్యాక్సిన్లు ప‌నిచేస్తాయా?.. శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారంటే!!

సెంచరీ చేసిన కాసేపటికే శ్రేయస్‌ అయ్యర్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే అక్షర్‌ పటేల్ (3) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో రవిచంద్రన్ అశ్విన్‌ (38) బ్యాట్‌ ఝళిపించాడు. అతడికి ఉమేశ్‌ యాదవ్‌ (10) సహకరించాడు. అశ్విన్‌ సహా ఇషాంత్ శర్మ (0) ఔట్ అవ్వడంతో భారత్ ఆలౌట్ అయింది. మిగతా భారత బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్ (13), శుభ్‌మన్ గిల్‌ (52), అజింక్య రహానే (35), చేతేశ్వర్ పుజారా (26) పరుగులు చేశారు. కివీస్ బౌల‌ర్ల‌లో కైల్ జేమిస‌న్ మూడు, ప‌టేల్ రెండు వికెట్లు తీసుకున్నారు. 

Also Read: Rakhi Sawant Comments: ఈ నటి విరుష్క జంటకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందట.. ఎందుకంటే..??

భారత్ ఆలౌట్ అనంతరం న్యూజిలాండ్ త‌న తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, విల్‌ యంగ్‌ ఆరంభంలో ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్నాక భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పేస్, స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెడుతూ పరుగులు చేశారు. దీంతో కివీస్‌ వికెట్‌ను పడగొట్టేందుకు భారత బౌలర్లు కష్టపడ్డారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. కివీస్ ఓపెనర్లు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరకు న్యూజిలాండ్‌ (New Zealand) వికెట్‌ కోల్పోకుండా ఆటను ముగించింది. భారత్‌ (India) కంటే ఇంకా 216 పరుగులు వెనుకబడి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News