Stock Market Update: స్టాక్ మార్కెట్లు సోమవారం (Stocks closing bell) అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) 32 పాయింట్లు బలపడి 60,718 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 6.70 పాయింట్లు పెరిగి 18,102 వద్ద స్థిరపడింది.
ఎఫ్ఎంసీజీ, విద్యుత్, ఫార్మా షేర్లు రాణించాయి. లోహ, బ్యాంకింగ్, ఆటో మొబైల్ షేర్లు డీలా పడ్డాయి. ఈ కారణంగా సూచీలు ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 61,036 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 60,597 కనష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,210 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,071 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.
Also read: Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
పవర్‌గ్రిడ్ 3.46 శాతం, ఐటీసీ 2.12 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.41 శాతం, నెస్లే 1.24 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.04 శాతం లాభాలను గడించాయి.
టాటా స్టీల్ 3.24 శాతం, ఎం&ఎం 1.19 శాతం, బజాజ్ ఆటో 0.98 శాతం, ఎస్బీఐ 0.89 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.77 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 155 కంపెనీలు లాభాలను గడించాయి. 15 కంపెనీలు నష్టపోయాయి. నేటి సెషన్లో ఐఆర్సీటీసీ 5 శాతం పెరిగింది.
Also read: Apple Store Workers: స్టోర్ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!
Also read: SBI Card Alert: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు షాక్- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్), హాంకాంగ్, సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై (చైనా) మాత్రం స్వల్పంగా నష్టపోయింది.
కాస్త పెరిగిన రూపాయి..
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.06 శాతం పుంజుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.48 వద్ద కొనసాగుతోంది.
Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం
Also read: Tips For reduce Expenses: ఈ టిప్స్‌తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook