Baby Human Tail: ఓ శిశువును చూసి వైద్యులు ఆశ్చర్యపోయిన ఘటన బ్రెజిల్ (Brazil)లో చోటుచేసుకుంది. ఎందుకంటే ఆ శిశువు తోకతో జన్మించాడు.
వివరాల్లోకి వెళితే..
ఫోర్టలెజా(Fortaleza) పట్టణానికి చెందిన 35 వారాల గర్భిణి పురుటినొప్పులతో ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స చేసి వైద్యులు మగ శిశువు(baby boy)ను బయటకు తీశారు. అయితే ఆ బాలుడికి తోక(Tail) ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 12 సెంటీమీటర్లు ఉన్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతి లాంటి ఆకారం కూడా ఉంది.
Also Read: Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. 'పడగ విప్పిన పాముకు ముద్దు'.. వహ్!
గతంలో ఆ మహిళకు వైద్య పరీక్షలు చేసినప్పటికీ తోక ఆనవాళ్లు బయటపడలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ తోకను 'నిజమైన మానవ తోక'గా అభివర్ణిస్తున్నారు. అయితే చర్మానికి మాత్రమే తోక పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి అనుసంధానం లేదని గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించినట్లు వెల్లడించారు.
శిశువు గర్బంలో ఉన్నప్పుడు దాదాపు నాలుగు నుంచి ఎనిమిది వారాలప్పుడు ఇలాంటి 'తోక' పెరుగుతాయని వైద్యులు చెప్పారు, అయితే అవి సాధారణంగా శరీరంలోకి తిరిగి వెళ్లి, దీని ఫలితంగా వెన్నెముక కింద ముడ్డి ఎముకగా ఏర్పడుతుంది. కానీ ఇలాంటి చాలా అరుదైన సంఘటనలలో మాత్రం తోక పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు నమోదయిన రికార్డుల ప్రకారం కేవలం 40 మంది పిల్లలు మాత్రమే అలాంటి తోకలతో జన్మించారు. ఇవి కొవ్వు, బంధన కణజాలం, రక్త నాళాలు, కండరాలు, నరాల ఫైబర్లతో కూడి ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి