MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రణాళిక సిద్ధమైంది. తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్ లోని 3 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 12:06 PM IST
MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

MLC Election Schedule: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. తెలంగాణలో 6,  ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌.. అదే రోజు లెక్కింపు జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 

ఈ ఏడాది మే 31న ఏపీలో మూడు, తెలంగాణలో జూన్‌ 3వ తేదీ నాటికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సమయంలో ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది.

ఎమ్మెల్సీలుగా ఏపీలో చిన గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌, సోము వీర్రాజు.. తెలంగాణలో ఆకుల లలిత, ఫరీజుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీకాలం ముగియడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 

Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు 

Also Read: New excise policy in Telangana: దీపావళి తర్వాత తెలంగాణలో కొత్త మద్యం పాలసీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

 

Trending News