Telangana: సెల్ ఫోన్ సిగ్నల్ కోసం శ్మశానికి...వైరల్ గా మెడికల్ విద్యార్థిని ఫోటో!

Online Classes: ఆ ఊర్లో సెల్ ఫోన్ సిగ్నల్ లేక శ్మశానికి వెళ్లి చదువుకుంటోంది ఓ మెడికల్ స్టూడెంట్. ఇప్పడు ఆ విద్యార్థిని ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 05:22 PM IST
Telangana: సెల్ ఫోన్ సిగ్నల్ కోసం శ్మశానికి...వైరల్ గా మెడికల్ విద్యార్థిని ఫోటో!

Online Classes: ప్రస్తుతం మనిషి జీవితాన్ని కోవిడ్ కు ముందు కరోనా వైరస్ తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా(Corona) ప్రభావం అన్నిరంగాలపై పడింది. ముఖ్యంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్, కళాశాలలు మూతపడటంతో...విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారానే క్లాసులు బోధిస్తున్నారు టీచర్లు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు  నెట్  సిగ్నల్స్(Signals) రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి విద్యుత్ సమస్యలు కూడా తోడయ్యాయి. 

గతంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో సిగ్నల్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు కొండప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్‌ కాసుల(Online Classes)కు హాజరవుతున్న ఫోటోలు  సోషల్ మీడియా(Social)లో వైరల్(Viral) గా మారిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆ వంతు తెలంగాణ(Telangana) కు వచ్చింది. జగిత్యాల జిల్లా(Jagittala District)లో ల్యాల మండలం సర్వాపూర్‌కు చెందిన మిర్యాల కల్పన స్వగ్రామంలో సిగ్నల్స్ లేకపోవడంతో సమీపంలోని శ్మశానవాటికకు వచ్చి ఆన్‌లైన్‌ క్లాసులు వింటుంది . ప్రస్తుతం ఈ మెడికల్ స్టూడెంట్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. 

Also Read:Sitara: సూపర్ స్టార్ డాటర్ సరికొత్త వీడియో..నెట్టింట వైరల్!

కల్పన 2017 లో ఎంసెట్‌లో 698 ర్యాంకు సాధించింది.  ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చేరింది. కరోనా(Corona) నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. ఊర్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌(Cellphone Signals) సమస్య తీవ్రంగా ఉంది. అయితే క్లాసెస్ కు హాజరుకావాల్సి ఉంది. దీంతో కల్పన నిత్యం శ్మశానవాటిక(graveyard ) వద్దకు వచ్చి ఆన్ లైన్ క్లాసులను వింటుంది. ఇదే విషయంపై కల్పన స్పందిస్తూ.. తనకు కుటుంబసభ్యుల సహకారం ఇస్తున్నారని..అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసుల కోసం ఇబ్బంది పడుతున్న తనలాంటి వారి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని.. సిగ్నల్స్ వచ్చే చేయాలని కోరుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News