Afghanistan: తాలిబన్ల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ? అక్షరాల రూ.11,829 కోట్లు...

అఫ్ఘానిస్థాన్ ను పూర్తిగా వశపరుచుకున్న తాలిబన్ల వార్షిక ఆదాయం ఏంతో తెలుసా ? రూ.11,829 కోట్లు..  ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్న తాలిబన్ల ఆర్ధిక మూలాలు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2021, 12:41 PM IST
  • తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్థాన్..
  • ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్న వారి వార్షిక ఆదాయం
  • 2016 తో పోలిస్తే 400 శాతం పెరిగిన వార్షిక ఆదాయం
  • డ్రగ్స్ అక్రమ సరఫరా, మైనింగ్‌ వ్యాపారాలే వారి ఆదాయ మూలం
Afghanistan: తాలిబన్ల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ? అక్షరాల రూ.11,829 కోట్లు...

అప్ఘానిస్థాన్‌- తాలిబన్లు.. (Afganistan-Taliban)ఇప్పుడే ఇదే హాట్ టాపిక్.. ఇపుడు ప్రపంచమంతా చర్చించుకుంటున్న ముచ్చట ఇదే. 
అగ్ర రాజ్యం అమెరికా తన సైనిక బలాలను ( U.S. military forces) వెనక్కి తీసుకున్న కేవలం ఒక వారం రోజుల్లోనే తాలిబన్లు (Taliban) దేశ వ్యాప్తంగా తమ జెండాని ఎగరవేసారు. రెండు దశాబ్దాల పాటూ, అమెరికా సైనిక బలగాల ద్వారా శిక్షణ పొందిన అప్ఘాన్ సైనిక బలగాలతో పోరాడుతూ, తాలిబన్లు ఇప్పటి యుద్ధక్షేత్రంలో నిలబడటం అందరిని విస్మయానికి గురి చేస్తుంది. 

Also Read: Heavy Rains Alert: రానున్న 48 గంటల్లో ఏపీకు అతి భారీ వర్షాల ముప్పు
అయితే ఈ రెండు దశాబ్దాల పాటు వారికి ఆర్హికంగా సహాయం ఎక్కడిది? సరైన సమయం కోసం వేసి చూస్తేంత మద్దతు ఎవరి నుండి లభించింది? అప్ఘానిస్థాన్‌ తాలిబన్లు (Taliban)వశం అయ్యాక తెరపైకి వచ్చిన కొన్ని ఆసక్తి కరమైన ఆర్థిక విషయాలు అందరిని అబ్బురపరుస్తున్నాయి. అవేంటంటే..??

2016 లో ఫోర్బ్స్‌ మ్యాగిజైన్ (Forbes Magazine) విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రపంచ సంపన్న ఉగ్రవాద సంస్థ లలో రూ.14,800  కోట్లు వార్షిక ఆదాయంతో  ఐసిస్‌ (ICC) మొదటి స్థానంలో ఉండగా, రూ.2900 కోట్ల వార్షిక ఆదాయంలో తాలిబన్లు (Taliban) 5వ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా ఎక్కువ శాతం ఆదాయం డ్రగ్స్ అక్రమ సరఫరా, మైనింగ్‌ వ్యాపారాల ద్వారా సమకూర్చుకుంటున్నారు. 
గత సంవత్సరం నాటో (NATO)విడుదల చేసిన నివేదిక ప్రకారం తాలిబన్ల వార్షిక బడ్జెట్ రూ.11,829 కోట్లు, అంటే 2016 లో గణాంకాలతో పోలిస్తే తాలిబన్ల ఆదాయం దాదాపు 400 శాతం పెరిగింది. కొన్నేళ్లుగా తాలిబన్లు విదేశీ నిధులు, వారి సహకారాలపై ఆధారపడినప్పటికీ, ఇపుడు ఎవరి సహాయ సాకారాలు లేకుండానే స్వయం సమృద్ధి విధానాన్ని అవలంభించి, అప్ఘాన్ ను చేజిక్కించుకుంది. 

Also Read: Karnataka: రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలకు సిద్ధమౌతున్న ప్రభుత్వం

అదే విధంగా అప్ఘానిస్థాన్‌ ప్రభుత్వం ఆ దేశ వార్షిక బడ్జెట్ రూ.40వేల కోట్లలో సైన్యానికి కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారు. వీటితో పాటుగా అమెరికా అప్ఘాన్ శిక్షణ దళాలకు గడిచిన 19 ఏళ్లలో దాదాపు  ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసింది. తాలిబన్లు అధికారంలో లేనప్పుడే వారి వార్షిక ఆదాయం (Taliban Annual income) 400 శాతం పెరిగితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వారి వార్షక ఆదాయం మరింత పెరొగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక తాలిబన్ల 2019-2020 వార్షక ఆదాయాల వివరాలు... 
మైనింగ్ -               రూ.3,400 కోట్లు
డ్రగ్స్ -                   రూ.3,087 కోట్లు 
విదేశీ విరాళాలు -  రూ.1,781 కోట్లు
ఎగుమతులు -       రూ.1,781 కోట్లు
పన్నులు -             రూ.1,187 కోట్లు
రియల్ ఎస్టేట్ -     రూ.593 కోట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News