Lambda Variant: డెల్టా కంటే ప్రమాదకరమైన మరో కరోనా వేరియంట్, 30 దేశాల్లో గుర్తింపు

Lambda Variant: కరోనా మహమ్మారి రూపం మార్చుకుని మరీ దండెత్తుతోంది. ఓ వేరియంట్ నుంచి ఉపశమనం పొందేలోగా మరో వేరియంట్ దాడి చేస్తోంది. ఇప్పుడు డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన మరో వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 7, 2021, 03:09 PM IST
Lambda Variant: డెల్టా కంటే ప్రమాదకరమైన మరో కరోనా వేరియంట్, 30 దేశాల్లో గుర్తింపు

Lambda Variant: కరోనా మహమ్మారి రూపం మార్చుకుని మరీ దండెత్తుతోంది. ఓ వేరియంట్ నుంచి ఉపశమనం పొందేలోగా మరో వేరియంట్ దాడి చేస్తోంది. ఇప్పుడు డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన మరో వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి(Corona pandemic) ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ వివిధ రకాల వేరియంట్లతో దాడి చేస్తోంది. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్(Delta Plus Variant) తరువాత ఇప్పుడు లాంబ్డా వేరియంట్ వెలుగు చూసింది. ఈ వేరియంట్..డెల్టా వేరియంట్(Delta Variant)కంటే అత్యంత ప్రమాదకరమని మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే ప్రపంచంలోని 30 దేశాల్లో లాంబ్డా వేరియంట్‌ను గుర్తించారు. యూకేలో కూడా లాంబ్దా వేరియంట్ కేసులు ఆరు వెలుగు చూశాయి. 

ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ (Lambda Variant) ఉద్భవించిందని మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. యూకేలో గుర్తించిన లాంబ్డా వేరియంట్..డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు చెబుతున్నారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాల్లో లాంబ్డా..దాదాపు 82 శాతముందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో 31 శాతంపైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వేరియంట్ సంక్రమణ వేగంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

Also read: Russian flight crashed: సముద్రంలో కూలిన రష్యా విమానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News